జాతీయ వార్తలు

శాంతికి ఎప్పుడూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: భారత్‌తో శాంతియుత సంబంధాలకు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రతిపాదన వచ్చినా దాన్ని తాము చిత్తశుద్ధితో పరిగణనలోకి తీసుకుంటామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల విభేదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసంలో ఎలాంటి సైనిక దాడులూ జరపకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సైనిక దళాలు పూర్తిస్థాయిలో గౌరవిస్తాయని ఆమె తెలిపారు. అదే క్రమంలో పాకిస్తాన్ ఎలాంటి శాంతి ప్రతిపాదనలు చేసినా దాన్ని కూడా అంతే చిత్తశుద్ధిలో పరిశీలిస్తామని అన్నారు. చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాక్ ఆర్మీ చీఫ్ ప్రకటనను ప్రస్తావించినప్పుడు ‘పాక్ నుంచి ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా దాన్ని మేము సదుద్దేశంతోనే స్వీకరిస్తాం. ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం’ అని సీతారామన్ తెలిపారు. కాశ్మీర్ సహా భారత్-పాక్ సమస్యలకు చర్చలే పరిష్కారం అని మరో రకంగా వీటిని నివృత్తి చేసుకునే అవకాశమే లేదని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో చర్చలకు పాక్ ప్రభుత్వం సిద్ధగా ఉన్నా అక్కడి సైనిక దళాలు మాత్రం విముఖంగా ఉంటాయన్న వాదనల నేపథ్యంలో బజ్వా ఆ ప్రకటన చేశారు. రంజాన్ మాసంలో సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులూ జరగకూడదన్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఆ విషయంలో జారీచేసిన మార్గదర్శకాలను సైనిక దళాలు త్రికరణశుద్ధిగా పాటిస్తాయని సీతారామన్ తెలిపారు. సైనిక దళాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మోథో విధానాలను అమలుచేయాల్సిన అవసరం ఉందని ఓ సెమినార్‌లో ఆమె పేర్కొన్నారు.