జాతీయ వార్తలు

సుఖోయ్‌తో చెంగ్డూకు చెడుగుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: భారతదేశ వైమానిక దళ సామర్థ్యం ఎప్పటికప్పుడు ఇనుమడిస్తోంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడంతోపాటు సవాళ్లను సైతం ఢీకొనడం, ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించడం వంటి సామర్థ్యాన్నీ వైమానిక దళం సంతరించుకుంటోంది. ముఖ్యంగా భారతదేశ వైమానిక దళంలో తలమానికం ‘సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకెఐ’ విమానాలు. వీటి సామర్థ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చైనా తాజాగా రూపొందిస్తున్న ‘చెంగ్డు జె-20’ యుద్ధ విమానాలు ఓ పట్టాన అంతుచిక్కేవి కాదు. రహస్యంగానే వాటి గమనం సాగుతుంది. ఉరుము పడ్డట్టుగా ప్రత్యర్థిపై దాడీ జరుగుతుంది. ఇలాంటి స్టీల్ సామర్థ్యం కలిగిన విమానాలను సైతం గుర్తించగలికే శక్తి, యుక్తి సుఖోయ్ విమానాలకు ఉంది. చైనాకు చెందిన అత్యాధునిక యుద్ధవిమానాలను గుర్తించడంతోపాటు వాటిని వెంబడించే సామర్థ్యం కూడా సుఖోయ్‌కి ఉంది. వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ రహస్య సామర్థ్యం కలిగిన చెంగ్డూ విమానాలను సుఖోయ్ గుర్తించగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాలను మరింత ఆధునీకరించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. వీటికి రష్యాకు చెందిన ఏఈఎస్‌ఏ రాడార్లను అమర్చడం ద్వారా వాటి శక్తిని మరింతగా ఇనుమడించే చర్యలను వైమానిక దళ అధికారులు చేపట్టారు. ఈ రాడార్ల వల్ల ఏకకాలంలో 30 ప్రత్యర్థి టార్గెట్లను గుర్తించడంతోపాటు వాటిలో ఆరింటిని ముఖాముఖీ ఎదుర్కొనగలిగే సామర్థ్యం కూడా సుఖోయ్ యుద్ధ విమానాలకు ఉంటుంది. తాజాగా ప్రయోగాత్మకంగా సుఖోయ్ యుద్ధ విమానాల శక్తియుక్తులను పరీక్షించారు. ఈశాన్య భారతంలో చేపట్టిన ఈ విన్యాసాల్లో భాగంగా టిబెట్ ప్రాంతంలో ఉన్న చైనా చెంగ్డూ విమానాలను సుఖోయ్ గుర్తించిందని భారత రక్షణ పరిశోధన విభాగం అధికారులు వెల్లడించారు. సుఖోయ్ విమానాలకు అమర్చిన రాడార్లు అత్యాధికమైనవని, వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యర్థి యుద్ధ విమానాలను గుర్తించి వెంబడించగలిగే శక్తి వీటివల్ల సుఖోయ్ విమానాలకు చేకూరుతుందని వైమానిక దళ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వీరేంద్ర సింగ్ ధనోవా వెల్లడించారు. చైనాకు చెందిన చెంగ్డూ యుద్ధ విమానాలు రాడార్లకు కూడా చిక్కవన్నది వాదన. అయితే భారత సుఖోయ్ విమానాలకు అమర్చిన ఆధునిక రష్యా రాడార్ల వల్ల ఈ విమానాలను భారత్ తేలికగా గుర్తించ గలుగుతుందని, వాటివల్ల కలిగే ప్రమాదాన్ని నివారించగలుగుతుందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లకు దీటుగా భారత వైమానిక దళం నిగ్గుదేలుతోందని తాజాగా సమకూర్చుకున్న అత్యాధునిక పరికరాల వల్ల వైమానిక సామర్థ్యమూ మరింతగా ఇనుమడించిందని ఆయన వెల్లడించారు. చైనా యుద్ధవిమానాలనే కాకుండా వాటికి మించిన శక్తి కలిగిన ఎలాంటి ఆధునిక విమానాలనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం వైమానిక దళానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘చైనా వైమానిక దళానికి ఉన్న లోపాలేవీ భారత వైమానిక దళానికి లేవు. అందుకు కారణం చైనా వైమానిక స్థావరాలు అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉండడమే’ అని ఆయన తెలిపారు. తమ దేశానికి చెందిన చెంగ్డూ యుద్ధ విమానాలకు తిరుగులేదని, ఎఫ్-22 రాప్టర్ అలాగే ఎఫ్-35, లైటెనింగ్-2 వంటి ఐదో తరానికి చెందిన అమెరికా యుద్ధ విమానాలకు మించిన సామర్థ్యం తమకు ఉందని చైనా నిపుణులు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సుఖోయ్ విమానాల ముందు చైనా చెంగ్డు విమానాలు దిగదుడుపేనన్న భారత వైమానిక దళాధినేత చేసిన ప్రకటనకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఏర్పడింది.