రాష్ట్రీయం

ఉప ఎన్నికలు ఇక జరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా లోక్‌సభ సభ్యత్వాలకు ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెలాఖరుకు ఆమోదించవచ్చు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయ్యే లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవు. వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు ఈ నెల 29న స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తమ రాజీనామాల గురించి స్పష్టత ఇవ్వనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. తనను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాల గురించి వివరించాలని సుమిత్రా మహాజన్ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలకు ఇటీవల లేఖ రాశారు. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి వివరణ ఇస్తామని ఆ పార్టీ ఎపీలు బదులివ్వటంతో సుమిత్రా మహాజన్ 29 తేదీనాడు వారికి సమయం కేటాయించారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు వై.వీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాదరావు 29న ఢిల్లీకి వచ్చి స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి లోక్‌సభ సభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాల గురించి వివరిస్తారు. అనంతరం సుమిత్రా మహాజన్ వాటిని ఆమోదించవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభకు ఇంకా ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఉంటేనే ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ నెల 18 తేదీనాటికి ఈ ఒక సంవత్సరం గుడువు పూర్తయింది. లోక్‌సభ తదుపరి ఎన్నికలకు ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం ఉన్నందున వైఎస్‌ఆర్‌సీపీల రాజీనామాలను ఆమోదించినా వాటికి ఉపఎన్నికలు జరిగే అవకాశాలు లేవని కేంద్ర ఎన్నిక సంఘం అధికారులు స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 18కి ముందు వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించి ఉంటే ఉప ఎన్నికలు జరిగేవి. ఇక ఇప్పుడా అవకాశం లేదని వారంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు మే ప్రారంభంలో జరగవలసి ఉన్న విషయం తెలిసిందే.