జాతీయ వార్తలు

విశాఖ పోర్టు ట్రస్టుకు కేంద్రం ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (వీపీటీ) కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్న రుణాలపై విధించిన వడ్డీపై వడ్డీ (పీనల్ ఇంటరెస్ట్)ను మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వలన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తీసుకున్న రుణాలపై విధించిన 250.89కోట్ల వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తారు. అయితే వీపీటీ తీసుకున్న రుణాలకు విధించిన వడ్డీపై వడ్డీకి బదులు 0.25 శాతం చొప్పున పీనల్ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అయితే వీపీటీ చెల్లించవలసిన 44.69 కోట్ల ప్రధాన రుణం, దానిపై విధించిన మామూలు వడ్డీని ఒకేదఫాలో జమ చేయాలని ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇనుప రజను ఎగుమతి చేసేందుకు ఒక లక్ష డీడబ్లుటీ సామర్థ్యం గల ఓడల రాకపోకలకు వీలు కల్పించే ఔటర్ హార్బర్ ప్రాజెక్టుకోసం 1970-71 నుండి 1984-85 సంవత్సరాల మధ్య 110.41 కోట్ల రుణాలను వివిధ సమయాల్లో తీసుకున్నది. వీపీటీ తీసుకున్న ప్రతి రుణాన్ని ఐదు సంవత్సరాల్లో చెల్లించవలసి ఉంటుంది. అయితే వీపీటీ తాను తీసుకున్న రుణాలపై 1978-79 వరకు వడ్డీని చెల్లించింది. ఆ తరువాత నష్టాలు రావటంతో 1979 నుండి 1990 వరకు తీసుకున్న రుణాలపై వడ్డీని చెల్లించలేకపోయింది. కాగా, వీపీటీ 1990-91 నుండి మూల రుణాలతోపాటు వడ్డీని కూడా చెల్లించటం ప్రారంభించింది. వీపీటి తీసుకున్న రుణం, పీనల్ వడ్డీ కలిపి 2017 మార్చి 31వ తేదీనాటికి మొత్తం 354.23 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఈ మొత్తంలో 44.69కోట్ల మూలరుణం, 58.65కోట్ల వడ్డీ మొత్తం, 250.89కోట్ల వడ్డీపై వడ్డీ ఇమిడి ఉన్నాయి.
వీపీటీకి భవిష్యత్తులో 2,671.79 కోట్ల అదనపు రుణ సహాయం అవసరమున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బకాయిలుగా ఉన్న 353.23కోట్ల రూపాయలను చెల్లించే స్థితిలో వీపీటీ లేదు. అందుకే కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం వీపీటీ చెల్లించవలసిన వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయించింది.