జాతీయ వార్తలు

ఒక్క హామీనైనా అమలుచేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మే 26: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ఈ నాలుగేళ్లూ ప్రజలకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని అమలుచేయలేదని శనివారం ఇక్కడ విరుచుకుపడింది. బీజేపీ నాలుగేళ్ల పాలనపై ‘ద్రోహం’పేరుతో రాసిన ఓ పుస్తకాన్ని కాంగ్రెస్ ఇక్కడ ఆవిష్కరించింది. రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పుల్లో కూరుకుపోయాడని పార్టీ ఆరోపించింది.
ఈ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగం కుదేలైదోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో నిరుద్యోగ సమస్య జఠిలంగా మారిందని ఆయన విమర్శించారు. లేబర్ బ్యూరో స్టాటిస్టిక్స్ గణాంకాలకు కాంగ్రెస్ బుక్‌లెట్‌లో పొందుపరిచారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ అభాసుపాలైందని అన్నారు. ‘దేశంలో మహిళలకు రక్షణ లేదు. రైతులు, యువత, వ్యాపారులు సమస్యలతో సతమతమవుతున్నారు’ అని పుస్తకంలో ఎన్‌డీఏ సర్కార్‌ను తూర్పారబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నరేంద్రమోదీ ప్రభుత్వం అలుచేయకుండా ప్రజలకు ద్రోహం చేసిందని పార్టీ కార్యదర్శి అన్నారు. మోదీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని జాగృతం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పాండే ధ్వజమెత్తారు. అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. జైపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మాట్లాడుతూ వసుంధర రాజే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విరుచుకుపడ్డారు. రాజే ప్రభుత్వంలో 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంతో సంప్రదించకుండా లోకాయుక్తను నియమించారని ఆయన అన్నారు. అధికార పార్టీనేతల అవినీతికి అంతూపంతూ లేకుండాపోయిందని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు.