రాష్ట్రీయం

మళ్లీ మేమే గెలుస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 26: వచ్చే ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 2019లో జరిగే ఎన్నికలు నరేంద్ర మోదీ సుపరిపాలనకు, మోదీని గద్దెదించాలన్న ఒకే లక్ష్యంతో అపవిత్ర బంధం ఏర్పాటు చేస్తున్న పార్టీలకు మధ్య పోటీ అని ఆయన అభివర్ణించారు. విపక్షాలకు అధికారం పట్ల ఉన్నంత యావ, దేశాభివృద్ధి పట్ల లేదన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతానని ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారని, కాంగ్రెస్‌లోనే రాహుల్ గాంధీ ప్రకటనపై ఆ పార్టీనేతలకు నమ్మకం లేదన్నారు. దేశాభివృద్ధి కోసం మోదీ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. గత నాలుగేళ్లలో అభివృద్ధికి చేయాల్సిందంతా చేశామని, మరో ఏడాది గడువు తమకు ఉందన్నారు. విపక్షాలకు అభివృద్ధి అజెండా అంటూ ఏమీ లేదని, వారికి కావాల్సిందంతా ప్రధానమంత్రి పదవి అన్నారు. వారసత్వం, కులం, మతపరమైన వాదాలకు కొమ్ముకాసే శక్తులకు, అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న మోదీకి మధ్య పోటీగా 2019 ఎన్నికలు నిలుస్తాయన్నారు. దేశంలో ప్రజలు మోదీ వెంటనే ఉన్నారన్నారు. యుపిఏ హయాంలో ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవం పోయిందని, కాగా మోదీ తన రాజనీతి, హుందాతనంతో ఆ పదవికివ వనె్న తెచ్చారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతి విషయానికి యుపిఏ చైర్‌పర్సన్ సోనియగాందీపై ఆధారపడేవారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 కాంగ్రెస్ ప్రభుత్వాల స్థానంలో బీజేపి అధికారంలోకి వచ్చిందన్నారు. మోదీ పట్ల వ్యక్తిగత వ్యతిరేకత తప్ప అభివృద్ధి అంటే విపక్షాలకు గౌరవం లేదన్నారు. కర్నాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తాను ప్రధాని అవుతానని చేసిన ప్రకటనకు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత కూడా అనుకూలంగా స్పందించి మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. మమత బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ తదితర సీనియర్ నేతలు కూడా ఈ విషయమై వౌనంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయన్నారు. టీడీపీ, శివసేనతో పొత్తు కొనసాగుతుందా అని ప్రశ్నించగా, తమకు శివసేనతో పొత్తు ఉందని, ఈ బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 11 పార్టీలు ఉన్నాయన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో బిఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీల పొత్తువల్ల బీజేపి విజయాలకు గండి పడుతుందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా ఈ తరహా ప్రచారాన్ని మీడియా చేసిందని, చివరకు ఫలితాలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. యువనేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ చేతులు కలపడంవల్ల బీజెపి పని అయిపోందని ప్రచారం చేశారన్నారు. కాని ఎన్నికల్లో ఈ కూటమి తుడిచిపెట్టుకుపోయిందన్నారు. కర్నాటకలో బీజేపి 104 సీట్లు గెలవడం మంచి పరిణామమన్నారు. దక్షిణాదిన తమ పార్టీ వేగంగా బలంగా విస్తరిస్తుందనేందుకు ఇంతకంటే నిదర్శనమేంటని ప్రశ్నించార. కాశ్మీర్‌లో పరిస్థితిపై మాట్లాడుతూ గత నాలుగేళ్లలో చోటుచేసుకున్న అనేక ఘటనల్లో ఉగ్రవాదులను మన జవాన్లు మట్టుపెట్టారన్నారు. ఇటువంటి ఉదంతాల్లో యుద్ధమనేది చివరి ఆఫ్షన్ అన్నారు.