జాతీయ వార్తలు

నినాదాలు, సొంత డబ్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: నినాదాలు, సొంత డబ్బా కొట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారని, అందుకే నాలుగేళ్ల బీజేపి పాలనకు ‘ఏ ప్లస్’ గ్రేడ్ ఇస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. వ్యవసాయం, విదేశాంగ విధానం, ఇంధన ధరలు, ఉద్యోగాల కల్పనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ‘ఎఫ్’ గ్రేడ్ ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ శనివారం ప్రొగ్రెస్ కార్డును ట్వీట్ ద్వారా విడుదల చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలు, స్వీయ ప్రచారానికి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కాగా మోదీకి యోగా, హామీలను ఇవ్వడంలో ‘బి’ గ్రేడ్ ఇచ్చారు. మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశానికి హానికరమైన వ్యక్తులని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. నాలుగేళ్ల కాలం సత్యదూరమైన అంశాలు, మోసాలు, ప్రతీకారాలతో మోదీ కాలక్షేపం చేశారన్నారు. మోదీ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, పనికిమాలిన సమస్యలపై దృష్టి పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.