రాష్ట్రీయం

తుది నివేదిక తర్వాతే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ తుది నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కుశాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం తెలుగు రాష్ట్రాలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు గురించి కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలిశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలోని కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో పేర్కొని ఉన్నదన్నారు. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటు పరిశీలించిన సెయిల్ సాధ్యం కాదని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. అప్పటి కేంద్రమంత్రులుగా ఉన్న వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, రెండు రాష్ట్రా ప్రభుత్వాలు ఈ పరిశ్రమల ఏర్పాటు సాధ్యసాధ్యలను పరిశీలించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారని, అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ సమర్పించే తుది నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, వౌలిక సదుపాయల కల్పించాల్సిన అవసరం ఉందని చౌదరి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా బయ్యారం, కడప ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు సాధ్యం కాదని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, అనవసరంగా ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై రాజకీయం చేయడం తగదని ఆయన హితపు పలికారు. మరోవైపు విశాఖలో 1.5 మిలియన్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే తెలంగాణలో పాల్వంచలో మూత పడిన స్పాంజి ఉక్కు పరిశ్రమ కేంద్రానికి అప్పగిస్తే కొత్త యంత్రాలతో తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్ వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ విభజన చట్టానికి అదనంగా తెలుగు రాష్ట్రాలలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని, దాని ద్వారా రెండు రాష్ట్రాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారం: దత్తాత్రేయ
తెలుగు రాష్ట్రాలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు విషయంలో టీఆర్‌ఎస్, టీడీపీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. బయ్యారం, కడప ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోందన్నారు. కేంద్రం ఎక్కడా కూడా ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడం లేదని ఆయన చెప్పారు. ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని బండారు దత్తాత్రేయ చెప్పారు. కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను బండారు దత్తాత్రేయతో పాటు వెదిరె శ్రీరామ్ తదితరులు ఉన్నారు.