జాతీయ వార్తలు

మళ్లీ గెలిచేదెట్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురైన ఓటమితో భయపడిపోయిన బీజేపీ అధినాయకత్వం ఈ సంవత్సరాంతంలో జరిగే మూడు రాష్ట్రాల శాసన సభలు, వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలకోసం ఇప్పటినుంచే వ్యూహ రచనకు ఉపక్రమించింది. మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకులతో సూరజ్‌కుండ్‌లో మూడు రోజులపాటు సమాలోచనలు జరిపింది. ఈ సంవత్సరాంతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసనసభలకు జరిగే ఎన్నికలు, వచ్చే సంవత్సరం లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహంపై మూడు రోజులపాటు చర్చలు జరిపారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానాలో ఉన్న సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన దాదాపు వంద మంది సీనియర్ నాయకులు మూడు రోజులపాటు మేథోమధనం జరిపి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా సూరజ్‌కుండ్‌లో సమావేశమైన బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల సమూహంతో మంతనాలు జరిపారు. సూరజ్‌కుండ్‌లో రూపొందించిన వ్యూహం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత కార్యదర్శులు బీజేపీ లోక్‌సభ సభ్యుల పని తీరు, విజయావకాశాలను సమీక్షించి ప్రత్యేక నివేదికలను తయారుచేస్తారు. ఈ నివేదికల ఆధారంగానే ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనేది నిర్ణయిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి ప్రస్తుతం లోక్‌సభలో 273 మంది సభ్యులున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘటన మంత్రులు (కార్యదర్శులు) 273 మంది లోక్‌సభ సభ్యులు గత నాలుగేళ్లలో ఏ మేరకు పని చేశారు.. ఎలాంటి ఫలితాలు సాధించారు.. వారిపట్ల నియోజకవర్గం ప్రజల అభిప్రాయం ఏమిటి? పార్టీ టికెట్ ఇస్తే మళ్లీ గెలుస్తారా? తదితర అంశాల ఆధారంగా నివేదికలు తయారుచేస్తారు. బీజేపీ లోక్‌సభ సభ్యులు ఏ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను తమ వెంట తీసుకుపోగలిగారు.. ఏ మేరకు తమ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశారనేది కూడా వీరు సమీక్షిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సంఘటన మంత్రులు ఇచ్చే నివేదిక ఆధారంగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల పంపిణీ జరుగుతుందని నా పార్టీ నాయకులు చెబుతున్నారు. లోక్‌సభ సభ్యుల పని తీరుపట్ల స్థానిక ఓటర్లు ఏమనుకుంటున్నారనేది కూడా అంచనా వేస్తారని అంటున్నారు. ఇదిలాఉంటే మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు గెలిచిన లోక్‌సభ నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులను కూడా అంచనా వేస్తారని చెబుతున్నారు. ఓటర్ల మద్దతు లభించని సభ్యులు ఎంత పెద్దవారైనా, సీనియర్ నాయకులైనా పార్టీ టికెట్ లభించదని వారంటున్నారు. బీజేపీ లోక్‌సభ సభ్యుల పని తీరును నిష్పక్షపాతంగా అంచనా వేయటం జరుగుతుందని వారు చెబుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసినవారు, ప్రజల అభివృద్ధికోసం పాటుపడిన వారికి మాత్రమే టికెట్లు లభిస్తాయని వారంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ఎంపీలు ఏ మేరకు ప్రజల వద్దకు తీసుకుపోయారనేది కూడా సమీక్షిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అభ్యర్థుల జాబితా కూడా తయారవుతుందని వారంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు, స్వయం సేవకులు నిర్వహించిన పాత్రపై కూడా మూడు రోజుల సమావేశంలో చర్చ జరిగిందని అంటున్నారు. ఎప్పటిమాదిరిగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు, స్వయం సేవకులు బీజేపీ తరపున పని చేస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌లు, స్వయం సేవకులు వీలున్నంత వరకు తెర వెనక నుండి పని చేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఎనభై లోక్‌సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో అనుసరించవలసిన వ్యూహంపై మూడు రోజుల సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది లోతుగా చర్చించారని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఆరు భాగాలుగా పనిచేస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ తమ పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్‌ను ఆరు భాగాలుగా విభజించి తమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఆరు భాగాల నాయకులకు ఎన్నికల పని అప్పగిస్తుందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ సీట్లను నిలబెట్టుకోగలిగితే రెండోసారి అధికారంలోకి రావటం సులభం అవుతుందని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.