జాతీయ వార్తలు

పూర్తిస్థాయి బడ్జెట్‌పై విభేదాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విషయంలో కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య విభేదాలు పొడచూపాయన్న వార్తలను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. జూలై మొదటి లేదా రెండోవారంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘‘ సిద్దరామయ్య వ్యక్తిగతంగా ఒక సలహా ఇచ్చారు. రాబోయే రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తాం’ అన్నారు. గతవారం సిద్దరామయ్య మాట్లాడుతూ, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న యోచనను తీవ్రంగా ఖండించారు. ఆవిధంగా కొత్త బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఆయన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కుమారస్వామి కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉన్నారు. సోమవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పుడు, తన ఉద్దేశాన్ని వెల్లడించగా, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘కొత్త సంకీర్ణ ప్రభుత్వం తన బడ్జెట్‌ను జూలై మొదటి రెండు వారాల్లో ప్రవేశపెడుతుంది. ఇందులో రైతులకు శాస్ర్తియ మార్గంలో రైతుల రుణాల మాఫీ చేయాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉన్నదని’ కుమారస్వామి రైతులకు హామీ ఇచ్చారు.‘రైతుల రుణాల మాఫీకి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు వీలుగా జాతీయ బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేస్తా’ అని కుమారస్వామి గతంలో పేర్కొన్నారు. బడ్జెట్ సందర్భంగా రైతులకు రుణమాఫీని ప్రకటించే అవకాశముంది. ఇదే సమయంలో రైతుల రుణమాఫీ కోసం కేంద్రం నుంచి 50 శాతం వరకు సహాయం కోరతామన్నారు. కర్ణాటకలో 85 లక్షలమంది రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. దుర్భిక్షం కారణంగా రైతులు తీవ్ర నైరాశ్యంతో ఉన్నారు. అందువల్ల రైతుల రుణాల మాఫీలో 50 శాతం వరకు కేంద్రం సహాయం చేయాలని కోరారు. ఇదేసమయంలో రైతులు ఎటువంటి దళారీల ప్రమేయం లేకుండా సరైన సమయంలో రైతులు నేరుగా రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.53 వేలకోట్లమేర ప్రభుత్వం రుణాలను మాఫీ చేయడం వల్ల, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై పెను ప్రభావం పడుతుందన్న భయాలను ఆయన కొట్టిపారేశారు. రైతు రుణాల మాఫీపై కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని అధికార్లు ఇప్పటికే కుమారస్వామికి తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా జేడీఎస్ మ్యానిఫెస్టోలో, ప్రధానంగా రైతు రుణమాఫీని పేర్కొంది.