జాతీయ వార్తలు

పార్టీ పునర్జీవమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప జేసేందుకు ప్రత్యేక కార్యచరణ పథకాన్ని సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి ఉమన్ చాందీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చాందీ ఆరోపించారు. బీజేపీతో మూడున్నర సంవత్సరాలు కలిసి పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలనటం విడ్డూరంగా ఉన్నదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీతో పాటు తెలుగు దేశం పార్టీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని చాందీ ఆరోపణలు గుప్పించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఎవరితోనూ ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ యంత్రాంగాన్ని పటిష్టం చేసే పనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఉమన్ చాండీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఉదయం కాంగ్రెస్ వార్ రూంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు, దాదాపు ఇతర ముప్పై మంది నాయకులతో సమావేశమై రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప జేయటం గురించి సమాలోచనలు జరిపారు. రాహుల్ గాంధీ మొదట సీనియర్ నాయకులతో ముఖా, ముఖి చర్చలు జరిపారు. ఆ తరువాత అందరితో కలిసి చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో ఏపీ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం ఉమన్ చాందీ ఏఐసీసీలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వార్ రూం చర్చల గురించి వివరించారు.
ఏఐసీసీ విలేఖరుల సమావేశానికి రఘువీరా రెడ్డి, రామచందర్ రావు తదితరులు కూడా హాజరయ్యారు. ఏపీలో కాంగ్రెను పునరుజ్జీవింప జేసేందుకు ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందించామంటూ పీసీసీ స్థాయి నుండి బూత్‌స్థాయి వరకు పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యాచరణ పథకం రానున్న నాలుగు నెలల్లో అమలు చేస్తామని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తాను పర్యటిస్తానన్నారు. మొదట ఎనిమిది రోజుల పాటు ఎనిమిది జిల్లాల్లో పర్యటిస్తాను. ఆ తరువాత మరో ఐదు రోజుల పాటు మిగతా ఐదు జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. నియోజకవర్గం, మండల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా స్థాయి సమావేశాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చాందీ వివరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉమన్ చాందీ డిమాండ్ చేశారు. మన్మోహ్‌న్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదిస్తే ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయటం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కకు తోసివేసిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించటాన్ని చాందీ గుర్తు చేశారు. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చాందీ చెప్పారు. పార్టీ నుండి వెళ్లిపోయిన వారంతా మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుంటారా? అని ఒక విలేఖరి అడుగగా ఎవరితో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పీసీసీలో మార్పులు, చేర్పులు ఉంటాయా? అని అడుగగా ప్రస్తుతానికి అలాంటిదేదీ లేదని చాందీ తెలిపారు.