జాతీయ వార్తలు

కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌గఢ్ (మధ్యప్రదేశ్), జూన్ 23: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను, అభూత కల్పలను ప్రచారం చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే, కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా ఎంచుకుందని విమర్శించారు. రాజ్‌గఢ్ జిల్లాలో మోహన్‌పురాలో నీటిపారుదల ప్రాజెక్టును శనివారం ప్రారంభించిన మోదీ మాట్లాడుతూ ప్రజలు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని అన్నారు. నిరాశావాదాన్ని ప్రచారం చేస్తూ, గందరగోళ పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్న వారు వాస్తవాలను విస్మరించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. విద్య, ఆరోగ్యంతోపాటు ఆర్థిక, సామాజికాది రంగాల్లోనూ దేశాన్ని ముందుకు నడిపించడానికి జన సంఘ్ బలమైన పునాదులు వేసిందన్నారు. అందుకు అవసరమైన ఆలోచనా విధానాన్ని, పనిచేసే శక్తిని యువతలో జొప్పించడం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిందన్నారు. శ్యామ ప్రసాద్ ఆలోచనా విధానాలు అద్భుతమని, ఆయన చూపిన దారిలో నడిస్తే, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్టార్టప్, మేక్ ఇన్ ఇండియా వంటి ఎన్నో పథకాలు శ్యామ ప్రసాద్ ఆలోచనలేనని స్పష్టం చేశారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి పథకాలను అమలు చేయలేదని మోదీ విమర్శించారు. ప్రజలపై కాంగ్రెస్‌కు నమ్మకమే లేదని ఎద్దేవా చేశారు. ఎంతో మంది ప్రముఖులు, మహనీయుల సిద్ధాంతాలు, ఆలోచనా విధానాలను ఒకే ఒక కుటుంబం అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశం ఐకమత్యంగా ఉండాలనే సిద్ధాంతంపై వారికి గురిలేదని, విభజించి పాలించడమే వారి సూత్రమని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నడూ తాము నిరాశావాదాన్ని వినిపించలేదని స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే తమకు తెలుసునని, ఆ ఆశయంతోనే తమ ప్రస్థానం కొనసాగుతున్నదని మోదీ పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్‌లో, నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు బాటలు వేస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని మోదీ తెలిపారు.