జాతీయ వార్తలు

నవ భారతంలో వికసించని బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: బాల్యంలో పుస్తకాల సంచి పట్టుకుని బడికి వెళ్లాల్సిన పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. నవ భారతంలో ఒకరు కాదు ఇద్దరు కాదు. ఎకాఎకిన 23 మిలియన్ల మంది బాలబాలికలు పనిచేస్తున్నారు. వీరి వయస్సు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో 19 మిలియన్ల మంది రకరకాల కారణాల వల్ల బడిని మధ్యలో మానేశారు. ఈ వివరాలను చైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై) సంస్థ విడుదల చేసింది. తనకో దిక్కులేదు కాని మెడకో డోలు అన్నట్లుగా వీరి పరిస్థితి తయారైంది. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న 9.2 మిలియన్ల మంది బాలలకు పెళ్లిళ్లయ్యాయి. ఇందులో 2.4 మిలియన్ల మంది బాలికలు ఉన్నారు. వీరు తల్లులు కూడా అయ్యారు. దారిద్య్రం, సామాజిక అణచివేతకు గురికావడం తదితర కారణాల వల్ల వీరంతా చదువుకు నోచుకోక, పనికి వెళ్లి, పైగా పెళ్లిళ్లు చేసుకుని తండ్రులు, తల్లులుగా మారారు. వీరి సంక్షేమంపై ప్రజాప్రతినిధులు,చ ట్టసభలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రై సంస్థ పేర్కొంది. చట్టప్రకారం 15-18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ప్రమాదకరం కాని పనులు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. అదే సమయంలో బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. 23 మిలియన్ల మందిలో 19 మంది మిలియన్ల మంది పిల్లల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రాజ్యాంగంలో బాలల హక్కుల పరిరక్షణకు అనేక హక్కులు కల్పించారు. ఇవేమీ ఆచరణలో అమలు కావడం లేదు. వీరిలో 25శాతం మంది 15-18 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు అత్యాచారానికి గురవుతున్నారు. దారిద్య్రం, నిరుద్యోగం వల్ల బాలబాలికలు చదువు మానేసి కార్మికులుగా మారుతున్నారు. 2011 జనాభా, 2015-16 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016, బాలల హక్కుల సంరక్షణ హక్కుల కమిషన్ నివేదికలన్నీ కూడా బాలల దుస్థితిని వివరించాయి. నేటి బాలలే రేపటి పౌరులు అనే సామెత వినసొంపుగా ఉంటుంది. కాని ఆచరణలో బాలల సంరక్షణ, సంక్షేమాన్ని పట్టించుకునే నాథులు లేరు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాలల సంక్షేమంకోసం ఇంతవరకు అమలు చేస్తున్న విధానాలను పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ బాలల హక్లు సంరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శ్రుతి కాకేర్ మాట్లాడుతూ, బాలలు దెబ్బతింటే దీని దుష్పలితాలను యావత్తు సమాజం భరించాల్సి వస్తుందన్నారు. బాలల సంరక్షణ విధానాలను రూపొందించే సమయంలో పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందన్నారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రియా నందా మాట్లాడుతూ, 15-18 సంవత్సరాల మధ్య ఉన్న బాల బాలికలు తప్పనిసరిగా బడికివెళ్లి చదువుకునే విధంగా అక్కడ వారికి సృజనాత్మకతతో కూడిన విద్యను బోధించేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు.