జాతీయ వార్తలు

ఆ పోస్టుకు అర్హత తగ్గించడంలో ఆంతర్యమేమిటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: కేంద్ర ప్రభుత్వం చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పోస్టుకు కావాల్సిన విద్య, వృత్తి నైపుణ్య అర్హతలను తగ్గించడంలో ఆంతర్యమేమిటో తెలియజేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ బ్యాంకుల్లో సైతం ఎకానమిస్టు పోస్టుకు ఉన్నతార్హతలు అడుగుతున్నారని, అలాంటిది చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పోస్టుకు అర్హతలు ఎందుకు తగ్గించారని, ఇందులో ఏమన్నా నిగూఢత ఉందా? అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఈనెల 20కల్లా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ పదవీ కాలం ఇంకా సంవత్సరం ఉండగా ఇంత తొందరగా ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. తీవ్ర ఒత్తిడి కారణాల వల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అమెరికా వెళ్లిపోతానని ఇటీవల సుమ్రణియన్ ప్రకటనే దీనికి కారణమా? అని ఆయన అన్నారు. ఈ పోస్టుకు ప్రకటించిన అర్హతల ప్రకారం అభ్యర్థి ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో అభ్యర్థి మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండి గరిష్ట వయోపరిమితి 56కి మించరాదని ఆయన చెప్పారు. కేవలం మాస్టర్ డిగ్రీ వ్యక్తులకే ఇంత పెద్ద పదవిని కట్టబెడతారా అని అహ్మద్ పటేల్ ప్రశ్నిస్తూ, దీనివెనుక ఏమన్నా స్వప్రయోజనాలు ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు.