జాతీయ వార్తలు

మితిమీరిపోతున్న అధికార పార్టీ ఆగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో దాడులు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీకి చెందినవారు పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగితే అధికార పార్టీ నాయకులను వదిలేసి ఇతర పార్టీ నాయకులపై పోలీసులు కేసులు పెడుతున్నారని కన్నా మండిపడ్డారు. తాను అనంతపురం పర్యటనకు వెళ్లినప్పుడు గెస్ట్‌హౌస్‌పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆయన చెప్పారు. కావలిలో చెప్పుల దాడి జరిగిందని, ఒంగోలులో తనపై దాడికి యత్నించగా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని కన్నా తెలిపారు. కానీ పోలీసులు మాత్రం బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు కూడా దాడికి పాల్పడినట్టు ఆయన తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని నిలదీస్తున్నందుకే దాడులు చేస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం తీరును ఎవరు ప్రశ్నించినా వేధిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా దోపిడీపైనే శ్రద్ధ పెట్టిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అన్ని స్థాయిల్లోనూ అవినీతి జరుగుతోందని కన్నా మండిపడ్డారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగితే మంచిదేనని, కాని తెలుగుదేశం పార్టీ నాయకులు అవిశ్వాసం పేరుతో నాటకాలు అడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 175 శాసనసభ స్థానాలకు పోటీచేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.