జాతీయ వార్తలు

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా సాగేటట్లు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ప్రజల సమస్యలను అర్థవంతంగా జరిగే విధంగా నడుచుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 18వ తేదీ బుధవారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే విపక్ష పార్టీలు అస్త్ర శస్త్రాలతో సమాయత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ విపక్షాలకు పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు హాలులో వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చిద్దామని మోదీ కోరారు. దేశ ప్రజలు పార్లమెంటుపై ఎన్నో ఆశలుపెట్టుకున్నారని, వారి సమస్యలను కూలంకషంగా చర్చిద్దామన్నారు. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరిస్తామని భరోసా ఇచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ప్రజలు పార్లమెంటు పనిచేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అనేక అంశాలు మనముందున్నాయని, వీటిపై పార్లమెంటు ఎలా చర్చిస్తుందనే విషయమై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనమంతా కలిసికట్టుగా ప్రజా సంక్షేమ విధానాలపై నిబద్ధతతో వ్యవహరిస్తామని ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు అనంత్ కుమార్ చెప్పారు. ఈ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా జరిగిందని మంత్రి చెప్పారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరిగే తీరును ప్రజలు పరిశీలిస్తున్నారన్నారు.ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడుచుకోవాలన్నారు. అన్నిపార్టీలు కూడా సభ జరగాలని ముక్తకంఠంతోకోరుతున్నాయన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలన్నారు. ఏ అంశంపైన కూడా పట్టుదలకు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా చర్చించేందుకు ప్రభుత్వం చొరవతో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు, అనుమానస్పద వ్యక్తులను అనుమానించి సామూహికంగా దాడి చేసి చంపేస్తున్న ఘటనలుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులుకల్పించాలనే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తెలిపారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఉన్నత విద్య రంగంలోనియామకాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పట్ల కేంద్రం పక్షపాతధోరణితో వ్యవహరిస్తోందని ఆప్ పార్టీ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ పరిష్కరించాలన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టినా మార్పులేదన్నారు. 24 రోజుల్లో 18 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సమావేశాలు సమావేశమవుతాయి. 46 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.