జాతీయ వార్తలు

మైనర్లపై అత్యాచారానికి ఇక మరణశిక్షే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు మరణ శిక్ష లాంటి కఠినమైన శిక్షలు ఖరారుచేసే విధంగా నేర శిక్ష్మా స్మృతి సవరణల బిల్లుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. పనె్నండేళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులు రుజువైన పక్షంలో దోషులకు మరణ శిక్షను విధించే విధంగా బిల్లుకు కేంద్రమంత్రి మండలి ఆమోదించింది. ఈ కేసులు రుజువైతే దోషులకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా మరణించే వరకు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించేందుకు వీలుగా బిల్లులో అంశాలను పొందుపరిచారు. 12 ఏళ్ల లోపుబాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులు రుజువైన పక్షంలో మరణించే వరకు జీవిత ఖైదు లేదా మరణ శిక్షను విధించే విధంగా బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెం టు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రి మండలి సమావేశమై ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. క్రిమినల్ లాను సవరిస్తూ ఆర్డినెన్సును ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన కేంద్రం జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో క్రిమినల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లో కథువాలో మైనర్ బాలిక, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నవలో మహిళ అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులు రుజువైన పక్షంలో కోర్టులు మరణ శిక్షను విధించేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది. మహిళలపై అత్యాచార ఘటనల్లో కేసులు రుజువైతే ప్రస్తుతం విధిస్తున్న ఏడేళ్ల కఠిన జైలు శిక్షను పదేళ్లకు పెంచారు. అవసరమైతే ఈ కేసులో జీవిత ఖైదుకు విధించే అవకాశాన్ని బిల్లులో పొందుపరిచారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలు రుజువైతే నేరస్తులకు శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచాలని బిల్లులో నిర్దేశించారు. అవసరమైతే జీవిత ఖైదు శిక్షను విధించే అవకాశాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు. ఈ కేసుల్లో జీవిత ఖైదు అంటే మరణించే వరకు జైలు శిక్ష కొనసాగుతుందని బిల్లులో పేర్కొన్నారు. 16ఏళ్లలోపు బాలికపై సామూహిక అత్యాచారఘటనలు రుజువైతే జీవిత ఖైదును విధించాలని ప్రతిపాదించారు. శిక్షలకు తోడు ఈ కేసులను సత్వరమే దర్యాప్తుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. దర్యాప్తు కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని పొందుపరిచారు. అన్ని రకాల రేప్ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసే విధంగా బిల్లులో అంశాలను పొందుపరిచారు. అలాగే ఈ కేసుల విచారణను ఆరు నెలల్లోగా ముగించాలి. 16 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు ముందస్తు బెయిల్ లభించదు. ఒక వేళ ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, బాధితురాలికి ముందుగా 15 రోజుల ముందు నోటీసును ఇవ్వాల్సి ఉంటుంది.