జాతీయ వార్తలు

29 వస్తువులపై సుంకాలు పెంచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం అదనపు సుంకాలను విధించడంతో ప్రభుత్వ, వాణిజ్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థ అప్పిలేట్ వివాద పరిష్కార కమిటీకి భారత్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నెల 19,20 తేదీల్లో ఈ ఫిర్యాదులపై అప్పిలేట్ కమిటీ విచారణ చేపట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సిఆర్ చౌదరి బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వెల్లడించారు. అమెరికా చర్యలకు దీటుగా స్పందించామన్నారు. అమెరికా నుంచి దిగుమతయ్యే 29 వస్తువులపై పది నుంచి 20 శాతం వరకు సుంకాలను పెంచామన్నారు. పెంచిన సుంకాలు ఆగస్టు 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఉక్కుపై అదనంగా 25 శాతం, అల్యూమినయంపై అదనంగా 10 శాతం సుంకాలను అమెరికా పెంచిందన్నారు. చైనా, జపాన్, యూరోప్ యూనియన్, కెనెడా, మెక్సికో దేశాలకు చెందిన ఉత్పత్తులపై కూడా అమెరికా దిగుమతి సుంకాలను పెంచినట్లు చెప్పారు. అప్పిలేట్ అథారిటీ భారత్, అమెరికా వాదనలను వింటుందన్నారు. కొన్ని దేశాలు సుంకాలను ఏకపక్షంగా పెంచడం వల్ల వాణిజ్య ఎగుమతుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో 167 దేశాలకు సభ్యత్వం ఉందని, ఇందులో 117 దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏకపక్షంగా వ్యవహరించేదేశాల పట్ల అప్రమత్తంగా ఉండి వారి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు చెందిన వారిని అప్పిలేట్ అథారిటీలో నియమించడంపై సాగుతున్న జాప్యాన్ని కూడా ప్రస్తావించినట్లు మంత్రి చెప్పారు. భారతదేశం సొంత ఆహార అవసరాల నిమిత్తం ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున నిల్వ చేస్తుందని, వీటిని పేదలకు పంపిణీ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.

రాష్టప్రతితో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ, జూలై 18: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నరసింహన్ బుధవారం ఉదయం రాష్టప్రతి కార్యాలయంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నరసింహన్ సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు, తదితర అంశాలపై వారితో గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది.