జాతీయ వార్తలు

గూండాలపై పెట్టే కేసులు స్వామీజీపై పెడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కార నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్వామికి జరిగిన నష్టాన్ని వివరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు ఒక లేఖ రాశారు. స్వామీజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని లేఖలో పేర్కొన్నారు. గూండాలపై పెట్టే కేసులను స్వామీజీపై పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. ఒక సాధువును గూండాల మాదిరి చూడటం సరికాదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడం అంటే ఆయనను తీవ్రంగా అవమానించడమేనని, అలాగే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని లేఖలో తెలిపారు. నగర బహిష్కరణ వల్ల ఆయన వాక్‌స్వాతంత్య్రం, ఉద్యమ స్వాతంత్య్ర హక్కులకు భంగం కలిగిందని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు. రాముడిపై కత్తిమహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. దీనితో కత్తి మహేష్‌తో పాటు పరిపూర్ణానంద స్వామిని కూడా పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి కూడా విదితమే.
పలు సంస్థల ధర్నాలు
పరిపూర్ణానంద నగర బహిష్కారాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ, బీజేపీ నేతలు రాష్టవ్య్రాప్తంగా గురువారం నాడు ఉద్యమించారు. రాష్ట్రంలో 223 చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు 15,563 మందిని అరెస్టు చేశారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శశిధర్ తెలిపారు.