జాతీయ వార్తలు

టీడీపీవి హోదా రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: టీడీపీ ప్రత్యేక హోదా కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందని బీజేపీ లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో తెలుగుదేశం చేతులు కలపడం సిగ్గుచేటని శుక్రవారం లోక్‌సభలో నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలతో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుఆత్మ క్షోభిస్తుందని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కంభపాటి మాట్లాడారు. ‘17,500 కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మీరు బ్యాంకు ఖాతా తెరిచేందుకు కూడా సిద్ధపడడం లేదు’అని హరిబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హరిబాబు, టీడీపీ సభ్యుల మధ్య పలుమార్లు తీవ్ర స్థాయిలోవాగ్వివాదం జరిగింది. టీడీపీ ఎంపీలు హరిబాబు హరిబాబు ప్రసంగాన్ని పలుమార్లు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఇప్పుడు మోసలికన్నీరు కారుస్తుంటే టీడీపీ ఆ పార్టీతోకలిసి పనిచేయడం సిగ్గు చేటన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే ఈ అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ఆయన నిలదీశారు. కాగా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన తెలుగుదేశం ఇప్పుడు విమర్శించటం సిగ్గు చేటన్నారు. విభజన జరుగుతున్నప్పుడు టీడీపీ సభ్యులు సభలో గొడవ చేశారే తప్ప తమకు ఏం కావాలనేది అడగలేదని ఆయన ఆరోపించారు. నిధుల కేటాయింపులో రాష్ట్రాల మధ్య తాము ఎలాంటి వివక్షా చూపలేదని బీజేపీ ఎంపీ చెప్పారు. ‘ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అది సాధ్యం కాదని భావించే ఇతరత్రా సాయం చేస్తామన్నాం’అని కంభంపాటి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కింద ఐదు సంవత్సరాలకు 17,500 కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి 17,500 కోట్ల సహాయం అందకుండా పోతోందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా మినహా ఇతరత్రా అన్ని రకాల సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హరిబాబు చెప్పారు. ‘మీకు పేరు కావాలా? సహాయం కావాలా? చెప్పండి’ అంటూ టీడీపీ ఎంపీలను నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంచింది. అయితే నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే ముంపు ప్రాంతాలను తెలంగాణ నుండి ఏపీకి బదిలీ చేసి సమస్యను పరిష్కరించారన్నారు. అలాగే పోలవరానికి 6,734 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి, దాన్ని పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, కడప ఉక్కు కార్మాగారం, వైజాగ్ రైల్వే జోన్, దుగ్గిరాజపట్నం పోర్ట్ హామీలను మాత్రమే ఇంకా పూర్తి చేయవలసి ఉందని బీజేపీ ఎంపీ తెలిపారు. రైల్వే శాఖ మంత్రి పియూష్ గొయల్ ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని హరిబాబు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన ఆరోపించారు.