జాతీయ వార్తలు

సత్సంప్రదాయానికి రాహుల్ నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ కౌగిలింతపై కాంగ్రెస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 20: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం ద్వారా దేశానికి రాజకీయాల్లో సత్సంప్రదాయాలు, కొత్త విలువలపై ఓ సందేశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. బీజేపీని ద్వేషాన్ని వ్యాప్తిచేయనివ్వండి. కాని మేము మాత్రం ప్రేమను పంచుతాం. సమాజాన్ని ముక్కలు చేయడం వారికి తెలుసు. మేము సామరస్యతను చాటుతాం. బీజేపీ విషం చిమ్ముతుంది. మేము భారతీయులంతా ఒక్కటేననే భావనను వ్యాపింపచేస్తాం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. హిందూయిజం, హిందూస్తానీ ఒకటేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారన్నారు. శత్రువులను కూడా ప్రేమించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. ద్వేషభావాలతో సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న బీజేపీకి అనుబంధం, ప్రేమ అంటే ఏమిటో రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. మోదీ పాలనలో దేశం మతం, కులం, ప్రాంతాల వారీగా చీలిపోయిందన్నారు. ఆహార అలవాట్లను కూడా ద్వేషించే పరిస్థితులు పెచ్చుమీరాయన్నారు. లోక్‌సభలో తన ప్రసంగం తర్వాత రాహల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి కౌగిలించుకున్న దృశ్యాలపై వెల్లువెత్తిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పై విధంగా స్పందించింది.