జాతీయ వార్తలు

చౌకీదారు కాదు.. దోపిడీలో వాటాదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపీకి అన్యాయం రాజకీయ కుట్రలో భాగమే * అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ తీవ్ర ఆరోపణలు
* ఆరోపణల్లో కొన్ని రికార్డుల నుండి తొలగింపు
న్యూడిల్లీ, జూలై 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశం చౌకీదార్ కాదు, దేశాన్ని దోచివేస్తున్న వారి భాగస్వామి అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దాడి చేశారు. రాఫెల్ యుద్ద విమానాల కాంట్రాక్టును ఒక బడా పారిశ్రామికవేత్తకు ఇప్పించి నలభై ఐదు వేల కోట్ల రూపాయల లాభం కలిగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ముప్పై ఐదు వేల కోట్ల అప్పులున్న వ్యాపార సంస్థకు ఇంత పెద్ద లాభం చేకూర్చే కాంట్రాక్టు ఎలా అప్పగిస్తారని రాహుల్ నిలదీశారు. ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. తాను నిజాలు బైట పెడుతుంటే నరేంద్ర మోదీ నవ్వుతున్నారు. తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం చేయలేక పోతున్నారంటూ రాహుల్ గాంధీ ఆయనను ఎద్దేవా చేశారు. మోదీపై ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ని బీజేపీ సభ్యులు పలుమార్లు ఎదుర్కొనటంతో సభలో పలు మార్లు గందరగోళం నెలకొన్నది. లోక్‌సభ ఒక దశలో పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది. వాగ్వివాదానికి దిగిన అధికార, ప్రతిపక్షం సభ్యులను శాంతింపజేసేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చాలా కష్టపడవలసి వచ్చింది. రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ఎదురు దాడి చేశారు. గాంధీ కుటుంబం సభా నియమాలను ఎప్పుడు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను ఆమె రికార్డుల నుండి తొలగించారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంపై తెలుగుదేశం సభ్యుడు కేసినేని శ్రీనివాస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ తరపున మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్‌డీఏ ప్రభుత్వం విధానాలు, ప్రధాన మంత్రిని చీల్చిచెండాడారు.

అధికారంలోకి వచ్చాక విచారణ
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై విచారణకు ఆదేశిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమపై విచారణకు ఆదేశిస్తారనే భయంతోనే నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో మరోసారి అధికారంరోకి వచ్చేందుకు వారిద్దరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తానన్న హామీని అమలు చేయటంలో నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యిరంటూ దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం గత సంవత్సరం కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించిందని, పకోడీల దుకాణం పెట్టుకోమని సూచించే మోదీ యువతకు ఉపాధి కల్పించలేరంటూ ఆయన ఎద్దేవా చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారం ఉపాధి సృష్టిస్తుంది, మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారం, పరిశ్రమలను దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ ఎవరి సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేశారని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన జీఎస్‌టీని నరేంద్ర మోదీ మార్పులు, చేర్పుల పేరుతో చెడ్డగొట్టి కోట్లాది మంది ప్రజలను దెబ్బ తీశారన్నారు. నరేంద్ర మోదీ సూటు, బూటు వేసుకునే పదిహేను, ఇరవై మంది పెద్ద వ్యాపారస్తులతో మాట్లాడుతారు తప్ప చిన్న వ్యాపారస్తుల కష్టాలు తెలుసుకోరని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ హృదయంలో బీదవారి పట్ల ఎలాంటి ప్రేమాలేదన్నారు. ప్రధాన మంత్రిని కాదు దేశం చౌకీదారునంటూ ప్రకటనలు చేసే నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడి కుమారుడు మోసాలకు పాల్పడితే పట్టించుకోవటం లేదన్నారు. యుపీఏ హయాంలో ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక యుద్ధ విమానం ఖరీదు 520 కోట్లుంటే నరేంద్ర మోదీ హయంలో ఇది 1600 కోట్లయ్యిందని ఆయన ఆరోపించారు. తన మిత్రుడైన ఒక పెద్ద వ్యాపారవేత్తకు లాభం కలిగించేందుకే నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానం ఖరీదును మూడింతలు పెంచారని రాహుల్ విమర్శించారు. ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందం ఉన్నందుకే రాఫెల్ యుద్ధ విమానం ఖరీదు ఎంత అనేది వెల్లడించటం సాధ్యం కాదనటం ద్వారా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభను తప్పుదోవపట్టించారని ఆయన ఆరోపించినప్పుడు సభలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాహుల్ గాంధీ సభకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. వాస్తవానికి ఏకే. ఆంటోని రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాఫెల్ డీల్ విషయంలో ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారని నిర్మలా సీతారామన్ తరువాత సభకు వివరించారు. తన ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేస్తున్న వారిలో ఒక వ్యాపారికి మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఇప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఎచ్‌ఏఎల్‌కు రావలసిన కాంట్రాక్టును తన స్నేహితుడికి ఇచ్చి వేల కోట్ల లాభం కలిగించారని మోదీపై ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ తప్పుపట్టటంతో సభలో గందరగోళం నెలకొన్నది. బడా వ్యాపారస్తుల ఒకటిన్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన నరేంద్ర మోదీ రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయటం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.