జాతీయ వార్తలు

పరువుతీసిన రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రపంచ దేశాల ముందు భారత రాజకీయ వ్యవస్థ, నాయకుల పరువు తీశారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నదని, అయితే, తాను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్‌ను సంప్రదించినప్పుడు అందులో రహస్యమేమీ లేదని ఆయన స్పష్టం చేశారని పార్లమెంటులో రాహుల్ చేసిన వ్యాఖ్యలను జైట్లీ ఫేస్ బుక్‌లో దుయ్యబట్టారు. ఊహాజనితమైన అంశాన్ని పార్లమెంటులో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సర్కారుపై తెలుగు దేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు వచ్చినప్పుడు రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తున్నదని, అందులోని అంశాలు బహిర్గతం చేసేవి కావంటూ వాదిస్తున్నదని అన్నారు. నిజానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్‌తో తాను స్వయంగా మాట్లాడానని చెప్పారు. మక్రాన్ ఒప్పందాన్ని బహిర్గతం చేయకూడదనే నిబంధన ఏదీ లేదని మక్రాన్ తనతో చెప్పినట్టు రాహుల్ అన్నారు. అయితే, రాహుల్ చేసిన ప్రకటనను ఫ్రెంచ్ సర్కారు ఖండించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని జైట్లీ తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో ఒక అసత్యాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసిన రాహుల్ యావత్ భారత రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చాలని విమర్శించారు. నిజం నిప్పులాంటిదని, రాహుల్ ప్రకటనను ఫ్రెంచ్ ప్రభుత్వం ఖండించమే ఇందుకు నిదర్శనమని జైట్లీ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, ప్రత్యేకించి ప్రధాన మంత్రి పదవిని ఆశించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఆ హోదాకు చేరుకోవాలనుకునే నాయకుడికి అజ్ఞానం, అబద్దాలు చెప్పడం, మాటమీద నిలబడలేకపోవడం వంటి మూడు గుణాలు ఉండకూడదని పేర్కొంటూ, రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని, దానికి సంబంధించిన చర్చలో సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని జైట్లీ తెలిపారు. ఎం తో సీరియస్‌గా జరగాల్సిన చర్చను రాజకీయ ప్రయోజనాలకు వేదికగా చేసుకోవాలన్న తు చ్ఛమైన సంప్రదాయం పార్లమెంటులో కనిపించిందని పేర్కొంటూ, రాహుల్ వ్యాఖ్యలు, చేష్టలపై విమర్శలు గుప్పించారు. విశ్వసనీయతను పెంచుకోవాల్సిన నేత అందుకు భిన్నం గా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. అవిశ్వాసం వీగిపోయిన విషయం తెలిసిందే.