అంతర్జాతీయం

సింగపూర్ ఆరోగ్య డాటాపై అతిపెద్ద సైబర్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థపై అతి పెద్ద సైబర్ దాడి జరిగింది. ఈ దాడి వెనక ప్రభుత్వంలోని కొంత మంది వ్యక్తులే కారణమై ఉండవచ్చని సింగపూర్ ప్రభుత్వం అనుమానిస్తోంది. సింగపూర్ ఆరోగ్య శాఖలో సాంకేతిక విభాగ వ్యవస్థపై జరిగిన సైబర్ దాడిలో 1.5 మిలియన్ల సింగపూర్ ప్రజల ఆరోగ్య సమాచారం తస్కరణకు గురైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన డాటాపై కూడా సైబర్ దాడి జరిగింది. సింగపూర్ ప్రధానమంత్రిలీ సైన్ లూంగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది కనీవినీ ఎరుగని సైబర్ దాడి అన్నారు. ఇది హ్యాకర్లు, క్రిమినల్ గ్యాంగ్ పని కాదని, ఇంటి దొంగలపనే అయి ఉంటుందని ఆయన అన్నారు. కాగా అధికారులు మాత్రం కేసు దర్యాప్తు జరుగుతోందని, సైబర్ దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆరోగ్య సమాచారం గురించి ప్రభుత్వంలో పనిచేస్తున్న సైబర్ నిపుణులే లీక్ చేసి ఉండవచ్చని దర్యాప్తు విభాగం అనుమానిస్తున్నట్లు ఆసియా పసిఫిక్ సైబర్ సెక్యూరిటీ ఫైర్ ఐ సంస్థ ప్రతనిధి ఇరిక్ హోహ్ చెప్పారు. అడ్వాన్స్‌డ్ టూల్స్‌ను ఉపయోగించి సైబర్ దాడి చేసి ఉంటారన్నారు. రష్యాకు చెందిన నిఘా సిబ్బంది ఇటువంటి దాడులు చేస్తుంటుందని ఆయన అన్నారు. ఆసియా పసిఫిక్ ఎండీ సంజయ్ అరోరా మాట్లాడుతూ, హెల్త్‌కేర్ సర్వీసులను అతలాకుతలం చేసేందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. కాగా ఈ ఘటనపై రిటైర్డు జడ్జి విచారణకు సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి జూలై 4 మధ్య డాటా బేస్ చౌర్యానికి సైబర్ దాడి చేసేందుకు కుట్ర జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ డాన్ కోట్స్ మాట్లాడుతూ, రష్యా, చైనా, ఇరాన్, ఉతర కొరియా దేశాలు సైబర్ దాడి చేసే నేరాలకు పాల్పడుతుంటాయని ఇటీవల ప్రకటించారు.