అంతర్జాతీయం

హంగ్ దిశగా పాకిస్తాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 25: పాకిస్తాన్ ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జాతీయ అసెంబ్లీలో కనీసం 172 సీట్లు తెచ్చుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందుతుంది. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఆధ్వర్యంలోని పీటీఐ పార్టీకి ఆధిక్యత లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. కాగా లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకునే సరికి సీను మారుతుందని సమాచారం. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితులు కనపడడం లేదు. కాగా ఈ ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని బోసా మండిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వేరువేరు చోట్ల జరిగిన ఘటనల్లో మరో నలుగురు మరణించారు. కాగా పాకిస్తాన్‌లోని 85వేల పోలింగ్ స్టేషన్లలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఎన్నికల లెక్కింపు సాయంత్రం ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి 24 గంటల్లోగా ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఐదేళ్ల పాటు పాకిస్తాన్ దిశ, దశను నిర్దేశించనున్నాయి.మొత్తం 10.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో దేశమంతటా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. 70 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఓటర్లు ఇంత చురుకుగా పోలింగ్‌రావడం ఇదే తొలిసారి అని రాజకీయ విశే్లషకులంటున్నారు. రావల్పిండిలో పాక్ ఆర్మీ అధినేత జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నవాజ్ షరీఫ్ పార్టీ పిఎంఎల్ ఎన్ అధినేత షాహ్‌బజ్ షరీఫ్ లాహోర్‌లో ఓటు వేశారు. తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్లను ఉత్సాహపరుస్తూ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో, ఆయన చెల్లెళ్లు ఆసిఫా భుట్టోజర్దారి, భక్తవార్ భుట్టో జర్దారి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 272 జనరల్ సీట్లకు 3459 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా నాలుగు జనరల్ ప్రొవిన్స్‌లు పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్‌కావాలో 577 అసెంబ్లీ సీట్లకు 8396 మంది అభ్యర్థులు పోటీ చేస్తన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదా 30 రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దింపారు. పోలింగ్ స్టేషన్లలో 1.6 మిలియన్ల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. 4.49 లక్షల మంది పోలీసులు, 3.70 లక్షల మంది సైనికులను భద్రత నిమిత్తం నియమించారు. ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్‌లో సెలవును ప్రకటించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లు ఉన్నాయి. ఇందులో 272 సీట్లకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మరో 60 సీట్లను మహిళలు, మిగిలిన సీట్లను మతపరంగా మైనార్టీలకు రిజర్వు చేశారు. ఐదు శాతం కంటే ఓట్లు పోలయిన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా ప్రాతిపదికన ఈ సీట్లను భర్తీ చేస్తారు. 1947లో భారత దేశం నుంచి విడిపోయి ఆవిర్భవించిన పాకిస్తాన్‌లో దశాబ్దాల తరబడి మిలిటరీ పాలన కొనసాగుతోంది. అప్పుడప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతోంది. ఈ ఎన్నికల్లో ముంబాయి దాడులకు సూత్రధారి హఫీజ్ సరుూద్ కూడా జమత్ ఉద్ దవా పేరిట అభ్యర్ధులను నిలబెట్టడం గమనార్హం. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇంతవరకు హింసాత్మక ఘటనల్లో 151 మంది మరణించారు.