అంతర్జాతీయం

మత కల్లోలాలు రెచ్చగొడితే పీచమణుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: అసోం జాతీయ పౌర రిజిస్టర్‌ను సాకుగా చూపించి దేశంలో మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నాలను సహించే ప్రసక్తిలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను అడ్డుగా పెట్టుకుని మతసామరస్యతను దెబ్బతీసే శక్తుల ఆటలు కొనసాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో జాతీయ పౌర రిజిస్టర్ అంశంపై జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ, భారతీయులకు ఈ పౌర రిజిస్టర్‌కు అన్యాయం జరగదన్నారు. ఒక్క భారతీయుడి కూడా నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసోంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పారు. జాతీయ పౌరరిజిస్టర్ ప్రక్రియను పారదర్శకతతో, శాంతియుతంగా ముగించినట్లు చెప్పారు. వివక్షకు తావులేకుండా ఎన్‌ఆర్‌సీని రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగదన్నారు. ఈ సందర్భంగా 1985లో అసోం ఒప్పందం వివరాలను ఆయన సభ్యులకు వెల్లడించారు. జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశమైనందున అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా మద్దతు ఇవ్వాలన్నారు. లిస్టులో పేరు లేని వారి పట్ల సాచివేత ధోరణిని అవలంబించే ప్రసక్తిలేదన్నారు. ఇప్పుడు విడుదల చేసిన రిజిస్టర్ తుది రిజిస్టర్ కాదని ఆయన స్పష్టం చేశారు. కాని కొన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలకు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయన్నారు. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని ఆయన అన్నారు. ఈ ప్రక్రియను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రిపిన్ బోరా మాట్లాడుతూ జాతీయ పౌరరిజిస్టర్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని, సరళీకృతంగా ఉండాలని, అనేక మంది మహిళలు, పిల్లలు తమ వారసత్వాన్ని రుజువుచేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ లిస్టులో పేరు లేని వారిని చొరబాటుదారులుగా పిలవరాదన్నారు. టీఎంసీ ఎంపీ దీరక్ బ్రైన్ మాట్లాడుతూ జాతీయ పౌర రిజిస్టర్ అసోంకే కాకుండా దేశానికి మొత్తం విస్తరిస్తుందన్నారు.