అంతర్జాతీయం

సమాంతర విచారణ సముచితం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఒకే సమస్యపై వివిధ న్యాయస్థానాల్లో సమాంతర విచారణ చేపట్టడం సముచితం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పేర్కొంది. దక్షిణ ఢిల్లీలోని కాలనీల్లో చెట్ల కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషన్‌ను ఎన్‌జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జావద్ రహీమ్, ఎస్పీ వాంగిడిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ కోర్టులో విచారణ ముగిసినందున అదే అంశంపై సమాంతర విచారణ సాధ్యం కాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులోఈ అంశంపై తుది నిర్ణయం జరిగిన తర్వాతే గ్రీన్ ట్రిబ్యునల్ దానిని పరిశీలిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జూలై 4న విచారణ జరిగిందని, అదే సమస్యకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని పేర్కొంది. ఇలావుండగా దక్షిణ ఢిల్లీలోని పలు కాలనీలలో హౌసింగ్, అర్బన్ ఎఫయిర్స్ శాఖ, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చెట్ల కూల్చివేతపై ట్రిబ్యునల్ స్టే విధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ కాలనీలలో ఇక ముందు ఒక్క చెట్టును కూడా కూల్చివేయరాదని, యథాతథ స్థితిని పాటించాలని ఆఖరిరోజు వాదన అనంతరం ట్రిబ్యునల్ పేర్కొంది. ఇదిలావుండగా కాలనీల అభివృద్ధి పేరుతో వేలాది చెట్లను నరికేశారని, ఇంకా 16 వేలకు పైగా చెట్లను తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలపై పలు ఎన్జీవోలు ట్రిబ్యునల్‌లో చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. కాలనీలో అభివృద్ధి పేరుతో ఇక్కడి చెట్లను నరికివేసి, వేరే చోట అదే సంఖ్యలో మొక్కలను నాటుతామనడం సమంజసం కాదని, ఆ చర్యతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించలేరని అన్నారు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్ చెట్ల నరికివేతను ఆపివేయాలని ఆదేశిస్తూ స్టేటస్‌కో విధించింది.

ఆ 124 పరిశ్రమలను మూసివేయండి
యూపీలోని కాళి, కృష్ణ, హిండన్ నదులలోకి కాలుష్య కారకాలను విడుదల చేస్తూ ఆరు జిల్లాల ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతున్న 124 పరిశ్రమలను వెంటనే మూసివేసి, వాటిపై కేసులను నమోదు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు తాగే ప్రాథమిక హక్కు ప్రతి పౌరునికి ఉందని, అయితే ఈ హక్కులకు భంగం కలిగిస్తూ వారి ఆరోగ్యంతో ఆటలాడుకునే వారిని ఉపేక్షించరాదని అన్నారు. ఎన్జీవో దోబపర్యావరణ సమితి తరఫున హాజరైన గౌరవ్‌కుమార్ బన్సాల్ తన వాదన వినిపిస్తూ కలుషితమైన నీటిని తాగడం వల్ల పలువురు కేన్సర్, ఇతర ప్రమాదకర వ్యాధులకు గురవుతున్నారని పేర్కొంది. కాలుష్యానికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని, రక్షిత నీటిని సరఫరా చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ, కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను వెంటనే మూసివేయించాలని ఎన్‌జిటి చైర్మన్ జస్టిస్ ఆదర్శకుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆరు జిల్లాల ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరాకు చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను వెంటనే తెలియజేయాలని ఆరు జిల్లాల జిల్లా మెజిస్ట్రేట్‌లను ఆయన ఆదేశించారు. అంతేకాకుండా కాలుష్యనీరు వస్తున్నందున ఈ ప్రాంతాల్లోని హ్యాండ్‌పంప్‌లను వెంటనే సీజ్ చేయాలని, మూడు నదుల శుద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను వివరించాలన్నారు.