జాతీయ వార్తలు

ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సహా 11 మంది ఎమ్మెల్యేలపై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై జరిగిన దాడికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 11 మంది ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న తనపై దాడి చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట 1300 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసులు సమర్పించారు. చార్జిషీట్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, 11 మంది ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్, ప్రకాష్ జార్వల్, నితిన్ త్యాగి, రితురాజ్ గోవింద్, సంజీవ్ ఝా, అజయ్ దత్, రాజేష్ రిషి, రాజేష్ గుప్త, మాదన్‌లాల్, ప్రవీణ్‌కుమార్, దినేష్ మోహానియా పేర్లున్నాయి. సీఎస్‌పై దాడికి పాల్పడిన వారందరూ ఐపీసీలోని వివిధ సెక్షన్ల క్రింద శిక్ష్హాలని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ సెక్షన్ల కింద కేసు రుజువైన పక్షంలో ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుంది. మే 18న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించడంతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్, ప్రకాష్ జార్వల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఫిబ్రవరి 19 రాత్రి తనపై దాడికి పాల్పడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.