జాతీయ వార్తలు

పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లలో తిరుపతికి మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఏ-1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత పాటించడంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దేశంలో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే ఎ కేటగిరీ రైల్వేస్టేషన్లలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అనే సంస్థ ఈ విషయంపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించింది. జోద్‌పూర్ రైల్వే స్టేషన్ ప్రథమ స్థానంలో నిలవగా జైపూర్ రైల్వే స్టేషన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ఆడిట్ కం సర్వేను మూడో దఫా రైల్వే శాఖ నిర్వహించింది. ఎక్కడెక్కడ పరిశుభ్రమైన ప్రాంతాలున్నాయో తెలుసుకోవడంతోబాటు నిర్వహణ లోపాలను సైతం కనుగొని రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతాప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతోనే ఇలా స్టేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత ప్రమాణాలను 38శాతం నుంచి 83 శాతానికి పెంచడం జరిగిందని, సుమారు నాలుగు కోట్ల మరుగుదొడ్లను నాలుగేళ్లలో నిర్మించడం జరిగిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వివరించారు. రైలు ప్రయాణికులకు పరిశుభ్రత, సమయపాలన, మంచి ఆహార సదుపాయాలను అందించాలని ప్రధాన ధ్యేయంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ఈ దిశలోనే గత నాలుగేళ్లలో స్వచ్ఛ్ రైల్..స్వచ్ఛ్ భారత్ ఉద్యమం విశేష ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రధానంగాప్రయాణికులు వేచివుండే గదులు, ప్లాట్‌ఫారాలు, రైళ్లు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. ఏ-1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఉత్తర, పశ్చిమ రైల్వేలో భాగమైన రాజస్థాన్‌లో యాత్రికుల ప్రాధాన్యత కలిగిన జోద్‌పూర్, జైపూర్ పరిశుభ్రతలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయని, అలాగే మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి రైల్వేస్టేషన్ సైతం దక్షిణ మధ్య రైల్వేలో తృతీయ స్థానాన్ని దక్కించుకోవడం హర్షణీయమన్నారు. ఏ కేటగిరీ రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత పాటించే స్టేషన్లలో మర్వార్ ప్రథమ స్థానాన్ని, పులేరా ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా మూడో స్థానంలో దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్ స్టేషన్ నిలించిందని మంత్రి తెలిపారు.