జాతీయ వార్తలు

రెప్పవాల్చని నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు చేశారు. చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా నగరమంతా రెప్పవాల్చని నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను దించారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద సోమవారం నాటి దాడి ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 70వేల మంది పోలీసులను మోహరించారు. పదివేల మందిని మొఘల్-ఎరా పోర్టు వద్ద దించారు. ఎర్రకోట వద్ద జరిగే 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు హాజరువుతారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు సామాన్య ప్రజలు తరలిరానున్నారు. గగనతలంపైనా ఓ నిఘా ఉంచాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎర్రకోట ప్రాంతంలో పతంగుల ఎగరవేయడాన్ని నిషేధించారు. గత ఏడాది ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో నలుపురంగు పతంగి వచ్చి పోడియం వద్ద పడడం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా ఉద యం 11 గంటల వరకూ ఎవరూ పతంగులు ఎగరవేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎర్రకోటకు వచ్చే మార్గంలో 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.