జాతీయ వార్తలు

జమిలికి అడుగులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 2019 ఫిబ్రవరిలో లోక్‌సభతోపాటు 12 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా సోమవారం లా కమిషన్‌కు రాసిన లేఖలో జమిలి ఎన్నికలను సమర్థించటం వెనక ఉన్న ఆలోచన ఇదేనని బీజేపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. జమిలి ఎన్నికలకోసం లోక్‌సభ కాల పరిమితిని మూడు నెలలు కుదించాలనుకుంటున్నారు. లోక్‌సభతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ శాసనసభల ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌పాటు మిజోరాం ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగవలసి ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత పవనాల మూలంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ పరాజయం పాలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఓటమి అనంతరం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనటం అంటే ఓటమికి స్వాగతం చెప్పినట్లేనని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే జమిలీ ఎన్నికల పేరుతో ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను లోక్‌సభతోపాటు కలిపి జరపాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. జమిలీ ఎన్నికలకోసం లోక్‌సభ ఎన్నికలను మూడు నెలల ముందుకు జరిపినట్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌తోపాటు మిజోరాం శాసనసభ ఎన్నికలను గడువుకు రెండు నెలల తరువాత జరపాలని అనుకుంటున్నారు. లోక్‌సభతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఎలాగూ జరుగుతాయి. వీటికి అదనంగా 2019 డిసెంబర్‌లో జరగవలసి ఉన్న మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలను గడువుకు దాదాపు పది నెలల ముందు జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేవిధంగా 2020 జనవరిలో జరగవలసి ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభ ఎన్నికలతో కలిపి జరిపాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. ఈ లెక్కన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ శాసనసభల ఎన్నికలు గడువుకంటే దాదాపు పది, పదకొండు నెలల ముందు జరిపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి వీటి ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో జోడించేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక మిగతా రాష్ట్రాల విషయంలో బీజేపీ ఇప్పటినుండే చర్చలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరిపే ప్రతిపాదన గురించి చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా ఇదివరకే చర్చించారనే మాట వినిపిస్తోంది. అయితే ఫిబ్రవరిలో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు జరిపిందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో లోక్‌సభతోపాటు 12 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిపించటం ద్వారా ఒక దేశం ఒకే ఎన్నిక అనే సిద్ధాంతానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపించటం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి మొదటి దశ కింద వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో లోక్‌సభతోపాటు 12 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపించటం ద్వారా దీనికి మొదట దశ జమిలి ఎన్నికలుగా ముద్ర వేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. 12లో 11 బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి వీటిని లోక్‌సభతో కలిపి జరిపేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. లోక్‌సభతోపాటు 12 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగాన్ని, ప్రజాప్రతినిధుల చట్టాన్ని సవరించవలసిన అవసరం లేదని బీజేపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.