జాతీయ వార్తలు

ఆప్‌కు అశుతోష్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్రనేత అశుతోష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే పార్టీనీ వీడుతున్నానని ఆయన బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఆయన రాజీనామాను తాను అంగీకరించడం లేదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. జీవితకాలంలో ఆయనను వదులుకునే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీతో తనకున్న అనుబంధం అందమైనది, విప్లవాత్మకమైనదని ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుందని, ఆప్‌తో తన తన బంధం ముగిసిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని, పూర్తి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని, ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదని, దయుంచి మీడియా తన వెంటపడకుండా తన ప్రైవసీని కాపాడాలని కోరుతున్నట్టు అశుతోష్ విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అశుతోష్ రాజీనామాపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఎప్పటికైనా మీ రాజీనామాను ఆమోదిస్తామని ఎలా అనుకుంటున్నారు? ఈ జీవితకాలంలో అది సాధ్యం కాదు అని పేర్కొన్నారు. ఆప్ ఢిల్లీ అధికార ప్రతినిధి సౌరబ్ భరద్వాజ్ మాట్లాడుతూ అశుతోష్ రాజీనామాను పార్టీ అంగీకరించడం లేదని ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నట్టు చెప్పారు. కాగా, ఇటీవల రాజ్యసభకు ఒక వ్యాపారవేత్తను పార్టీ తరఫున పంపడంపై అశుతోష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీలోని కొందరు అంటుండగా, ఆయనను రాజ్యసభకు పంపలేదన్న కోపంతోనే పార్టీకి గుడ్‌బై చెప్పారని మరికొందరు పేర్కొన్నారు. కాగా, ఆప్ పార్టీ విధాన నిర్ణయాల్లో అశితోష్ ప్రముఖ పాత్ర పోషించేవారు. పొలిటికల్ అఫయిర్స్ కమిటీ, ఇతర విభాగాల్లో ఆయన కీలకనేతగా వ్యవహరించేవారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల అనంతరం ఆయన పార్టీ కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొంటున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టుగా పనిచేసిన అశుతోష్ తర్వాత రాజకీయనేతగా మారారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్ చేతిలో ఓడిపోయినా, కాంగ్రెస్ అగ్రనేత కపిల్‌సిబాల్ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.