జాతీయ వార్తలు

ఎన్నో ప్రధాన ఘట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*1996, 98, 99లో వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆరు దశాబ్ధాల పాటు భారత రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జీవితంలో ప్రధాన ఘట్టాలు
1951లో భారతీయ జనసంఘ్‌లో చేరిన వాజపేయి. జనసంఘ్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవిత ప్రస్తానం ప్రారంభం. అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా నియామకం
1955-77: జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక
1966-67: పార్లమెంటులో హామీల కమిటీ చైర్మన్‌గా నియామకం
1967-70: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక
1968-73: దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణంతో, జనసంఘ్ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన వాజపేయి. ఈ జాతీయ కమిటీలో దిగ్గజాలు నానాజీ దేశ్‌ముఖ్, బలరాజ్ మథోక్, ఎల్‌కే అద్వానీ ఉన్నారు.
1977: 1977 ఎన్నికల్లో జనతాపార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వాజపేయి. 1979లో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో జనసంఘ్‌ను రద్దు చేశారు.
1980-86: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, వాజపేయి, ఎల్‌కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్‌ల కీలక పాత్ర
1996: లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ. 1996లో స్వల్పకాలం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వాజపేయి. ఆ తర్వాత 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వాజపేయి. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వాజపేయి (1996), రెండోసారి (1998-99), మూడవసారి (1999-2004).
1996: 1996 ఎన్నికల్లో అప్పటి రాష్టప్రతి శంకర్ దయాళ్ శర్మ వాజపేయిని చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పదవ ప్రధానిగా వాజపేయి ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర పార్టీల మద్దతు లేకపోవడంతో 13రోజుల పాటు ప్రధానిగా విధులు నిర్వహించి పదవికి రాజీనామా చేశారు.
1998: రెండు యూనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు రెండేళ్ల కాలంలో పతనమయ్యాయి. లోక్ సభ రద్దయింది. 1998 ఎన్నికల్లో బీజేపికి ఎక్కువ సీట్లు చవ్చాయి. ఎన్డీఏ కూటమి సారథ్యంలో ప్రధానిగా వాజపేయి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రభుత్వం 13 నెలలు అధికారంలో ఉంది. అన్నాడిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో ఓటమి చెందింది. లోక్‌సభ రద్దయింది. ఎన్నికలయ్యేంత వరకు వాజపేయి ప్రధానిగా ఉన్నారు.
1999: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సారథ్యంలో బీజేపీ కూటమికి 303 సీట్లు వచ్చాయి. మూడవసారి వాజపేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2004: ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందింది. ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించారు. ప్రతిపక్ష నేతగా ఎల్‌కే అద్వానీ ఎన్నికయ్యారు. కాగా ఎన్డీఏ చైర్మన్‌గా వాజపేయి ఉన్నారు.
2005: క్రియాశీలరాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వాజపేరుూ ప్రకటించారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేతగా వాజపేయి పేరు తెచ్చుకున్నారు.