జాతీయ వార్తలు

ఆయన స్ఫూర్తితోనే ప్రజా బాహుళ్యంలోకి.. : కోవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: వాజపేయి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని, ఆయన ఉన్నత ఆశయాలను చూసే తాను న్యాయవాద వృత్తిని విడనాడి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఈ మేరకు ఆయన వాజపేయి పెంపుడు కుమార్తె నమితా కౌల్ భట్టాచార్యకు ఒక లేఖ రాస్తూ వాజపేయితో పనిచేయడం మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబానికి తీరని లోటని, తనకు కూడా నష్టమని, ఆయన కారణంగానే తాను న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి ప్రజాసేవకు వచ్చానన్నారు. తాను రాష్టప్రతిగా ఎన్నికైన తర్వాత ఆయనను కలవడానికి వెళ్లానని, అప్పటికే ఆయన అస్వస్థులై మంచంపై ఉన్నారని, తనను చూసి కనురెప్పలను కదిలించారని, ఆ కదలికలతోనే ప్రశాంతంగా ఆయన నన్ను ఆశీర్వదించినట్టు భావించానని కోవింద్ తెలిపారు. వాజపేయి మరణం లక్షలాది మందికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన తమ ప్రియతమ నేత అని, కవిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, ఒక మేధావిగా, ఒక నేతగా దేశానికి ఆయన అందించిన సేవలను జాతి మరువదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

శ్రేష్ఠమైన పెద్దమనిషి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ, ఆగస్టు 17: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాజపేయి ఒక శ్రేష్టమైన పెద్దమనిషి అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వాజపేయి మృతితో ఒక శకం ముగిసిందని అన్నారు. రాజకీయాల్లో ఒక కృతనిశ్చమయమైన లక్ష్యంతో ముందుకు సాగారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రాబల్యంలో ఉన్న దేశానికి అద్వానీతో కలిసి రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయం చూపిన నేత అని ప్రశంసించారు. అంతేకాకుండా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సృష్టించారని అన్నారు. తన ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడమే కాక అవి జాతి ప్రయోజనాలను సంరక్షించేలా చూసుకునే వారన్నారు. అటు సొంత పార్టీ వారు కాని, విపక్షాలు కాని ఆయనపై ఎలాంటి వివాదాస్పదమైన విమర్శలు చేసే సాహసం చేయలేక పోయాయని అన్నారు. 1998లో జరిగిన పోఖ్రాన్ పరీక్షలప్పుడు, పాకిస్తాన్‌తో జరిగిన శాంతి చర్చలప్పుడు తాను ఉండటం అదృష్టం గా భావిస్తున్నాన్నారు. ప లు ఆర్థిక సంస్కరణలు చే పట్టడానికి వాజపేయి ఆ ద్యుడిగా నిలిచారని జైట్లీ పేర్కొన్నారు.