జాతీయ వార్తలు

మా నాన్నా-నేనూ ఒకే క్లాస్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 17: తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదవడం, ఒకే హాస్టల్ ఉండటం ఎక్కడైనా చూశారా? కాని వాజపేయి జీవితంలో ఇది నిజంగా జరిగింది. వాజపేయి, ఆయన తండ్రి పండిట్ కృష్ణ బిహారీలాల్ వాజపేయి ఇద్దరూ కలిసి కాన్పూరులోని కాలేజీలో లా చదివారు. తొలుత వారిద్దరూ ఒకటే క్లాసులో, ఒకటే హాస్టల్‌లో సైతం ఉండేవారు. ఇదే విషయాన్ని 2002-03లో పబ్లిష్ అయిన కాలేజీ మేగజైన్‌లో రాసిన ఆర్టికల్‌లో వాజపేయి వివరించారు. ఇలా జరగడానికి గల నేపథ్యాన్ని కూడా ఆయన తెలియజేశారు. ‘అది 1945-46. నా బిఏ చదువు పూర్తయ్యింది. పై చదువులకు వెళ్దామని ఆశపడ్డా.. కాని అప్పటికే మా నాన్న ప్రభుత్వ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో పెళ్లికెదిగిన ఇద్దరు చెల్లెళ్లు. ఇటువంటి పరిస్థితుల్లో పై చదువుల మీద ఆశ వదులుకున్నాను. అయితే అదృష్టవశాత్తు నా గురించి తెలిసిన గ్వాలియర్ మహారాజ శ్రీమంత్ శివాజీరావు సిందియా నా చదువు నిమిత్తం నెలకు 75 రూపాయలు, ఇప్పుడది (2002-03కు 200 రూపాయలతో సమానం) ఇవ్వడానికి సమ్మతించారు. దీంతో నేను కాన్పూరులోని డిఎవి కాలేజీలో లా కోర్సులో చేరాను’ అని వివరించారు. తన పెద్దన్నయ్య అప్పటికే అదే కాలేజీలో చదువుతున్నాడని, తాను కాలేజీలో చేరిన కొద్దిరోజులకే హఠాత్తుగా తన తండ్రి కూడా అదే కాలేజీలో లాకోర్సులో చేరాడని, 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైరైన తర్వాత ఈ చదువేంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని వాజపేయి తన ఆర్టికల్‌లో వివరించారు. తొలుత తమ ఇద్దరినీ ఒకే క్లాస్‌లో ఉంచారని, ఎప్పుడైనా మా నాన్న ఆలస్యంగా వస్తే ‘మీ నాన్న గారు ఎక్కడికి మాయం అయిపోయారు?’ అని, నేను ఆలస్యంగా వస్తే మా మా నాన్నగారితో ‘మీ అబ్బాయి కన్పించడం లేదే?’ అని ఆటపట్టించే వారని వాజపేయి పేర్కొన్నారు. తర్వాత తన తండ్రిని వేరే తరగతికి మార్చాలని, హాస్టల్‌లో మాత్రం ఇద్దరూ కలిసే ఉండేవారమని, ఇది చాలా అరుదైన సంఘటన అని ఆయన తన ఆర్టికల్‌లో వివరించారు.