జాతీయ వార్తలు

బీజేపీపై ఇక దూకుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టేందుకు కాంగ్రెస్ నెల రోజుల ఉద్యమాన్ని ప్రకటించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతితోపాటు మోదీ ప్రభుత్వం ఇతర అవినీతి గురించి వివరించేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నాయకులకు పిలునిచ్చారు. శనివారం పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నాయకులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్ నాయకులతో రెండు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం నెల రోజుల ఉద్యమాన్ని ప్రకటించారు. రాఫెల్ యుద్ధ విమానల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని రాహుల్ డిమాండ్ చేయటం తెలిసిందే. దీనికి ప్రభుత్వం అంగీకరించటం లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ అవినీతిని ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించి రాఫెల్ డీల్ కుంభకోణం గురించి ప్రజలకు వివరిస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల్ సమావేశానంతరం విలేఖరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏం చేసినా తాము భయపడే ప్రసక్తే లేదు.. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల వద్దకు తీసుకుపోతాం.. బీజేపీని ఎండగడతాం అని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ కుంభకోణం మూలంగా దేశానికి దాదాపు నలభై ఒక్క కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆయన చెప్పారు. కేవలం పది రోజుల ముందు రిజిష్టరు చేసుకున్న సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని సుర్జేవాలా, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. యుద్ధ విమానాలను ఇంతవరకు హెచ్‌ఏఎల్‌లో ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం యుద్ధ విమానాల తయారీని ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఇస్తోందని వారు దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితుడైన ఒక బడా పారిశ్రామికవేత్తకు ఇచ్చుకున్నారని వారు ఆరోపించారు. రాఫెల్ కుంభకోణం గురించి మారుసుమూల గ్రామాల ప్రజలకు కూడా వివరిస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.
కేరళకు నెల వేతనం విరాళం
భారీ వర్షాలు, వరదల మూలంగా నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవటంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలు, శాసనసభ్యులు తమ ఒక నెల వేతనాన్ని కేరళ రాష్ట్రానికి విరాళంగా ఇస్తారని ఆయన తెలిపారు.