జాతీయ వార్తలు

కొత్త శకం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 18: పాకిస్తాన్‌లో కొత్త శకం ప్రారంభమైందని, కొత్త ప్రభుత్వం దేశ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ‘కప్తాన్’ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ 22వ ప్రధానిగా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పాక్‌ను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65 ఏళ్ల ఇమ్రాన్ నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికైన ఇమ్రాన్‌తో దేశాధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రధానిగా ప్రమాణం చేయించారు. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నారు. ఆర్థిక సంక్షోభం, పొరుగు దేశాలతో సరైన ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడం వంటి సమస్యలు ప్రధానమైనవి. అంతేగాక, ఉగ్రవాదాన్ని పెకళించే మాట ఎలావున్నా కనీసం అదుపుకూడా చేయలేకపోతున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, అంతర్జాతీయ సమాజం నుంచి భారీ స్థాయిలో ఆంక్షలు ఉంటాయన్న భయం కూడా పాక్‌ను వెంటాడుతున్నది. ఇంటాబయటా అనిశ్చితి నెలకొన్న తరుణంలో, ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇమ్రాన్ హామీ ఇచ్చారు. పాలనా వ్యవహారాల్లో సైన్యం పాత్రను పరిమితం తగ్గిస్తానని అన్నారు. భారత్‌సహా సరిహద్దు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు కృషి చేస్తానని అన్నారు. కాశ్మీర్ అంశాన్ని సైతం చర్చిస్తానని పేర్కొన్నారు.

ఆదిలోనే ఆలస్యం..
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం ఈనెల 11న జరుగుతుందని తొలుత ప్రకటించారు. ఆతర్వాత పాక్ స్వాతంత్య్ర దినోత్సవమైన 14వ తేదీకి వాయిదా వేశారు. కానీ, అది వాస్తవ రూపం దాల్చలేదు. ముచ్చటగా మూడోసారి శనివారం నాటికి వాయిదా పడింది. చాలా ముందుగానే అనుకుంటున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి అవాంతరాలు ఉండవనే అంతా అనుకున్నారు. కానీ, శనివారం ఉదయం 9.30 గంటలకు మొదలుకావాల్సిన ఈ కార్యక్రమం 49 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

మాటల్లో తడబాటు
ఎక్కువగా విదేశాల్లో ఉంటూ, ఉర్దూకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఇమ్రాన్‌కు ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో తన మాతృభాషతోనే ఇబ్బంది ఎదురైంది. ‘ఐవాన్ ఎ సదర్’ (జాతీయ అసెంబ్లీ నేత)గా ఎన్నికైన ఇమ్రాన్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తూ దేశాధ్యక్షుడు మమ్నూన్ ‘రోజ్ ఏ ఖియామత్’ (తీర్పు రోజు) అని చెప్పారు. కానీ, ఆ పదాలను ఇమ్రాన్ తప్పుగా ఉచ్ఛరించారు. ‘రోజ్ ఏ ఖియాదత్’ (నాయకుడి రోజు) అంటూ కొత్త భాష్యమిచ్చాడు. జరిగిన పొరపాటును మమ్నూన్ సీరియస్‌గా తీసుకోలేదు. ఇమ్రాన్ కూడా ఓ నవ్వుతో తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ చదువుతున్నంత సేపూ ఇమ్రాన్ చాలా ఒత్తిడికి లోనైనట్టు కనిపించారు.

హాజరైన సిద్ధు
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధు హాజరయ్యారు. మరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. ఇలావుంటే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బాజ్వా, ఇమ్రాన్‌తో కలిసి క్రికెట్ ఆడిన వసీం అక్రం, రమీజ్ రజా, పలు దేశాలకు చెందిన దౌత్యాధికారులు పదవీ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.