జాతీయ వార్తలు

‘ఆప్’ నెల జీతం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కేరళలో భారీ జలవిలయాన్ని సృష్టిస్తూ ఇప్పటి వరకు 194 మందిని బలిగొన్న వర్షబీభత్సంపై దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ ఒకరోజు జీతాన్ని కేరళ భాధితుల సహాయార్థం విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే పది కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేరళకు ఆప్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నెల జీతాన్ని కేరళ వర్ష భాధితుల సహాయార్థం ప్రకటించారని, అలాగే బాధిత రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రజలు విరాళాలు ఇచ్చేందుకు సహృదయంతో ముందుకు రావాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో కేజ్రీవాల్ శనివారం మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం 10 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తులో ఈనెల 8 నుంచి ఇప్పటి వరకు 194 మంది మృతి చెందడంతోబాటు సాగులోవున్న పంటలు, టూరిజం సదుపాయాలు, వౌలిక వసతులు దారుణంగా దెబ్బతినడం శోచనీయమని కేజ్రీవాల్ అన్నారు.