జాతీయ వార్తలు

ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కేరళలో బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు యాజమాన్య నిర్వహణ బలగాలు అతి పెద్ద ఆపరేషన్ చేపట్టాయి. నీటి ముంపునకు గురైన ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు తరలిస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన కేరళలో వర్షాలు, వరదలు ప్రారంభమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ఇంతవరకు పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 58 బృందాలను కేరళకు పంపించారు. ఇందులో 55 బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. 2006లో తొలిసారిగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద ఆపరేషన్ చేపట్టినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి చెప్పారు. ప్రతి టీంలో 35 నుంచి 40 మంది సభ్యులు ఉంటారు. ఇంతవరకు 10,467 మందిని రక్షించనట్లు ఆయన చెప్పారు. 159 మందికి రక్షించిన వెంటనే వైద్య సహాయం అందించారు. త్రిస్సూర్, పతనంతిట్టా, అలప్పుజా, ఎర్నాకుళం, ఇదుక్కి, మల్లాపురం, వాయనాడ్, కోజికోడ్‌లో సహాయక చర్యలను అహర్నిశలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.