జాతీయ వార్తలు

కదలి వచ్చిన రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి/అహ్మదాబాద్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కేరళను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ట్రస్టుల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు, స్వచ్చందసేవా సంఘాలు వితరణ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ప్రొపర్టీ సంస్థ రూ1.5 కోట్ల ఆహార పొట్లాలను పంపింది.
రాజస్తానీ సంక్షేమ అసోసియేషన్, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సంస్థ రూ.51 లక్షల వితరణ ప్రకటించింది.
గుజరాత్ ప్రభుత్వం రూ.10 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కేరళ ప్రజల కష్టాలను పంచుకుంటామని ముఖ్యమంత్రి విజయ్ రూపా నీ చెప్పారు.
కాగా మహారాష్ట్ర కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత ధనుంజయ్ ముండే మాట్లాడుతూ కేరళలో ప్రకృతి బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.500 కోట్ల నిధులు సరిపోవని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచాలని ఆయన కోరారు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కఠార్ రూ.10 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.
ఇప్పటికే పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
జార్ఖండ్ ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. కష్టకాలంలో కేరళకు అండగా ఉండామని ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.10 కోట్ల నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. కేరళ ప్రజలకు కష్టకాలంలో వెనుదన్నుగా నిలుస్తామని ఆయన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు లేఖ రాశారు.
కేంద్ర మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ వంద మెట్రిక్ టన్నుల అప్పటికప్పుడు తినేందుకు వీలైన వంద టన్నుల ఆహార పదార్థాలను కేరళకు పంపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి బాలామృతం పౌష్టికాహారాన్ని పంపుతున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ ఆహారం ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు పిల్లల ఆకలిని తీరుస్తుంది. గోధుమలు, సెనగలు, పాలపౌడర్, నూనె, పంచదారతో బాలామృతాన్ని తయారు చేస్తారు. ఈ ఆహార ప్యాకెట్లు వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు అవసరమైన సిబ్బందిని కేరళలో ఏర్పాటు చేశారు.