క్రైమ్/లీగల్

గోధ్రా కేసులో మరో ఇద్దరికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 27: గోధ్రాలో రైలుకు నిప్పంటించి 59 మంది సజీవదహనానికి కారణమైన కేసుకు సంబంధించి మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ముగ్గుర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికి 33 మంది దోషులకు శిక్షలుపడ్డాయి. 2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైలు మారణకాండలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. గుజరాత్ చరిత్రలోనే చోటుచేసుకున్న అల్లర్లు, హింసాకాండలో వెయ్యి మంది వరకూ మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రెండు బోగీలను అల్లరి మూకలు దగ్ధం చేశాయి. దీనికి కుట్ర పన్నిట్టు ఆధారాలు లభించడంతో ఫరూక్ భానా, ఇమ్రాన్ షేరుకు సిట్ ప్రత్యేక న్యాయమూర్తి హెచ్‌సీ వోరా యావజ్జీవ శిక్ష విధించారు. హుస్సేన్ సులేమాన్, కసం భామేడీ, ఫరూక్ దాంతియాను నిర్దోషులుగా కోర్డు విడుదల చేసింది.
ఈ ఐదుగుర్ని 2015-16 మధ్య కాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబర్మతి కేంద్ర కారాగారంలో కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపారు. హుస్సేన్ సులేమాన్ మధ్యప్రదేశ్‌లోని జాబువాలో అరెస్టు చేశారు. భామేడీని గుజరాత్‌లోని దహోడ్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. దాంతియా, భానాను గోధ్రాలోని ఓ ఇంట్లో పట్టుకున్నారు. భాతుక్‌ను మహారాష్టల్రోని మాలేగావ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. 2011 మార్చి 1న సిట్ ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా ప్రకటించింది. అందులో 11 మందికి మరణశిక్ష విధించారు.
మిగతా 20 మందికి జీవించినంత కాలం శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది. 2017 అక్టోబర్‌లో 11 మంది మరణశిక్షను యావజ్జీవంగా మార్చిన గురజాత్ హైకోర్టు మిగతా 20 మంది శిక్షలను సమర్ధించింది. తాజాగా 37 మంది సాక్షులను విచారించిన సిట్ న్యాయమూర్తి వోరా తీర్పును వెలువరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేఎం పంఛాల్ మాట్లాడుతూ నిర్దోషులుగా విడుదలైన ముగ్గురి కేసును పై కోర్టులో సవాల్ చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. సబర్మతి జైలులో విచారణ ఖైదీగా ఉన్న సాబీర్ పటాలియా గత జనవరిలో గుండెపోటుతో మరణించాడు.