అంతర్జాతీయం

అందంగా ఉంటే అంతేమరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, సెప్టెంబర్ 1: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన తర్వాత వెనక్కు తగ్గడం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్డ్‌కు అలవాటుగా మారింది. ఇటీవలే ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు, అక్కడున్న మహిళను ‘ముద్దు ఇస్తావా’ అని అడిగి సమస్యలను కొని తెచ్చుకున్నాడు. విపక్షమేగాక, స్వపక్షంలోనూ అందరూ ముక్తకంఠంతో చీవాట్లు పెట్టడంతో ‘జోక్ చేశా.. అంతే’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అతని బుద్ధి మారలేదని తాజాగా చోటు చేసుకున్న సంఘటన నిరూపిస్తున్నది. మహిళా సాధికారికతపై జరిగిన ఒక సదస్సుకు హాజరైన డ్యూటెర్డ్ రెచ్చిపోయి మాట్లాడాడు. మహిళలు అందంగా ఉంటారని, అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని సెలవిచ్చాడు. అందమైన అమ్మాయిలు ఉన్నంతకాలం రేపులకు తెరపడదని చెప్పాడు. ఈ వ్యాఖ్య కూడా దుమారం రేపింది. ఇంత నీచంగా మాట్లాడతారా అని మహిళా సంఘాలు విమర్శిస్తుంటే, తమాషాకు అన్నానని డ్యూటెర్డ్ వివరణ ఇచ్చుకున్నాడు. మరీ అంతలా నోటరు మారేసుకోవడం ఎందుకో? ఆతర్వాత తీరిగ్గా క్షమాణలు, వివరణలు చెప్పుకోవడం ఎందుకో?