జాతీయ వార్తలు

నగరాల్లో నిరాశ్రయులకు గూడు కల్పించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: పట్టణాలు, నగరాల్లో సొంత ఇళ్లు లేని పేదలను వారి మానాన వారిని నిరాశ్రయులుగా వదిలేయకుండా కనీస గృహ సదుపాయాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. నగర ప్రాంతాల్లో గూడు లేని వారికి ఆశ్రయం కల్పించే విషయమై కమిటీలు ఏర్పాటు చేయాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు 12 రాష్ట్రప్రభుత్వాలకు రూ.1.5 లక్షల వరకు జరిమానాను విధించింది. కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ఈ విషయమై ఇచ్చిన నివేదిక అధ్వాన్నంగా ఉందని కోర్టు పేర్కొంది. తాము ఈ ఏడాది మార్చి 22వ తేదీన నగరాల్లో తలదాచుకునేందుకు కనీసం ఇల్లు కూడా లేనివారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. శీతాకాలం వస్తోందని, తాము సూచించినట్లుగా , పౌర కమిటీలను ఏర్పాటు చేసి నగరంలో ఇల్లులేని వారికి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరామని కోర్టు పేర్కొంది. కాని ఈ ఆదేశాలను రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోలేదని అసంతృప్తి ధర్మానం అసంతృప్తి వ్యక్తం చేసింది. చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, గోవా, మిజోరాం, మేఘాలయ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు రూ.1.5 లక్షల వరకు జరిమానాను విధించారు. హర్యానాకు రూ.5 లక్షల జరిమానాను విధించారు. కేరళ, ఉత్తరాఖండ్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రాష్ట్రాలకు జరిమానాను విధించలేదని ధర్మాసనం పేర్కొంది. శీతాకాలం వస్తోందని, నిర్లక్ష్యం వహిస్తే కనీసం గూడు లేని వారి సంగతేమిటని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంభించరాదని కోర్టు హెచ్చరించింది. కేంద్రానికి అందరికీ పక్కా ఇల్లు అనే విధానం ఉంటే ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. మూడు వారాల్లోగా జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసు అథారిటీ వద్ద డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది. అందరికీ పక్కా ఇల్లు కల్పించేందుకు ఒక ప్రణాళికతో నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. నగరాల్లో ఇల్లులేకుండా ఉన్నవారు ఎంత మంది ఉన్నారు ? నిరాశ్రయులు ఎంత మంది ఉన్నారు ? వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేశారు ? అనే ప్రశ్నలకు సరైన జవాబులతో నివేదికను రూపొందించి నవంబర్ మొదటి వారంలోగా కేంద్రానికి ఆయా రాష్ట్రప్రభుత్వాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొన్ని రాష్ట్రాల్లో పౌర కమిటీ సమావేశాలకు అధికారులు హాజరుకావడం లేదన్నారు. రాజస్తాన్‌లో పౌర కమిటీ సమావేశానికి ముఖ్య కార్యదర్శి హాజరు కాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్‌ఎస్ నాదకర్ణి బదులిస్తూ, అందరికీ పక్కా ఇల్లు అనే లక్ష్యంతో పాండిచ్చేరి, కర్నాటక, ఢిల్లీలో సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బిహార్, పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామన్నారు.