జాతీయ వార్తలు

భారత్‌కు వలసలు తగ్గాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి గతంలో మాదిరిగా పెద్ద వలసలు లేవని, ఈ రోజు బంగ్లాదేశ్ ప్రజలు సుఖవంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నారని బంగ్లాదేశ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్ మేజర్ జనరల్ షాఫీనుల్ ఇస్లాం చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని వలసలు ఉంటున్నాయని, వీరంతా ఉమ్మడి సంస్కృతి, కుటుంబ బంధాలతో ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారన్నారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ పొడువు సరిహద్దు ఉందన్నారు. గత ఆరు నెలల్లో వంద మంది సరిహద్దులను దాటినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున వలసలు లేవన్నారు. బంగ్లాదేశ్‌లో జీడీపీ 7.1 శాతం నమోదైందని, అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయన్నారు. శుక్రవారం క్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, కుటుంబ సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. తమ బంధువులను చూసేందుకు ఇరుదేశాల ప్రజలు సరిహద్దులను దాటుతుంటారన్నారు. స్నేహితులు, బంధువులను చూసిన తర్వాత మళ్లీ ఇండ్లకు చేరుకుంటారన్నారు. కాగా బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీజీ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది ఇంతవరకు 1522 మంది బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చారన్నారు. 166 మంది పొరపాటున సరిహద్దులు దాటిన వారేనన్నారు. ఇరుదేశాల మధ్య పశువుల అక్రమ రవాణా కూడా గణనీయంగా తగ్గిందన్నారు. బంగ్లాదేశ్‌లో పాడి పశువుల పెంపకం పెరిగిందన్నారు. సరిహద్దుల్లో అనేక నదులు, కాల్వలు ఉన్నాయని, వీటిని ప్రజలు అటూ ఇటూ దాటుతుంటారన్నారు. ఇరుదేశాల సరిహద్దుల వద్ద గస్తీ తిరుగుతున్న భద్రత బలగాలు చొరబాటుదారులు, స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సరిహద్దుల్లో కాల్పులు లేవని, మరణాలు లేవన్నారు. మరో ఐదు నేర రహిత జోన్లను సరిహద్దుల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.