జాతీయ వార్తలు

వచ్చే ఐదేళ్లలో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వచ్చే ఐదేళ్లలో దేశంలోని మొత్తం వాహనాల సంఖ్యలో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చి కాలుష్యాన్ని తగ్గించడమే కాక, ఇంధన వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, స్మార్ట్‌చార్జింగ్ వంటి రంగాలలో పెట్టుబడులను పెట్టాలని, కొత్త రంగాలకు మనం వ్యాపారాలను విస్తరించడం ద్వారా మరింత అభివృద్ధిని సాధించవచ్చునని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి కాలుష్యరహిత శక్తి అవసరమని, అది ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా మనకు లభిస్తుందని, ఎలక్ట్రిక్ వాహనాలను కేవలం కార్లవరకే పరిమితం చేయకుండా వాటిని స్కూటర్, రిక్షాలు వంటి వాటికి సైతం విస్తరించాలని ఆయన సూచించారు. ఇక్కడ ‘మూవ్’ పేరుతో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ మార్పు అన్నది ప్రస్తుత ఆర్థిక స్థితిని మార్చే గొప్ప ఆయుధమని, కొత్త రంగాల్లోకి మనం మారడం వల్ల రవాణా, ప్రయాణ ఖర్చులు సైతం తగ్గి దేశం మరింత ఆర్థికాభివృద్ధిని సైతం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగంగా మారనుందని, ఈ రంగం ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు సైతం సృష్టింపబడతాయని అన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద కాలుష్య సమస్యను ఈ రంగం ద్వారా అధిగమించవచ్చునని ఆటోపరిశ్రమ సీఈఓలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల స్మార్ట్ చార్జింగ్ యూనిట్ల ఏర్పాటు నిమిత్తం పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అన్నారు. గత ఏడాది రెండు వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, వచ్చే ఐదేళ్లలో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ఉండాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, దీనివల్ల మనం చమురు దిగుమతులను సైతం తగ్గించుకోవడమే కాక, కాలుష్యాన్ని అరికట్టవచ్చునని ప్రధాని మోదీ అన్నారు. మనం కేవలం కార్లపైనే దృష్టిపెట్టకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే స్కూటర్లు, బైక్‌లు, రిక్షాల వంటి వాటిని కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అలాగే ప్రజారవాణా వ్యవస్థను ఎంత ఎక్కువగా ఆశ్రయిస్తే అంత తక్కువ ట్రాఫిక్ ఇబ్బందులతో బయటపడటమే కాక ఆర్థికంగా కూడా లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ‘క్లీన్ కిలోమీటర్లు’ ఆలోచనలో మనమే ఛాంపియన్లమని, భారత్ వ్యాపారులు, ఉత్పత్తిదారులు ఈ నూతన బ్యాటరీ టెక్నాలజీపై దృష్టి సారించి కాలుష్యరహిత భారత్‌ను ప్రజలకు అందించడానికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం చేసిన అనివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రహదారుల నిర్మాణాన్ని తమ హయాంలో రెట్టింపు చేశామన్నారు. కాలుష్య రహిత వాహనాల త యారీని ప్రోత్సహిస్తున్నామని, పలు ప్రాంతాలను వా యుమార్గం ద్వారా కలుపుతూ అతి తక్కువధరకే ప్ర యాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రస్తుతం భార త్ అతివేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ముం దున్నదని, దేశవ్యాప్తంగా వంద స్మార్ట్‌సిటీలను నిర్మించామని, రైల్‌లైన్లు, పోర్టులు, రోడ్లు, ఎయిర్‌పోర్టులు అతివేగంగా నిర్మించిన ఘనత తమదేనని మోదీ చెప్పారు.