జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం అమలు నిలిపివేతపై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఎస్సీ,ఎస్టీ చట్టంపై పార్లమెంట్‌లో చేసిన సవరణల బిల్లు అమలును నిలిపివేస్తూ ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఆగస్టు తొమ్మిదిన ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆగస్టు తొమ్మిదిన పార్లమెంట్‌లో చేసిన సవరణలు సవరించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైన వారిని వెంటనే అరెస్టు చేయరాదని, ప్రభుత్వ ఉద్యోగులైతే వారి పై అధికారి అనుమతి తీసుకున్న తర్వాతనే అరెస్టు చేయాలంటూ చట్టంలో పెట్టిన సవరణలపై ఆ సంఘాలు మండిపడ్డాయి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. దీనిపై సుప్రీంలో దాఖలైన కేసును శుక్రవారం విచారించిన జస్టిస్‌లు ఎకె సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై ఆరువారాల్లోగా తమ స్పందనను తెలియేజయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు కొత్త చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని పిటిషనర్ల తరఫున వాదించిన పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన విజ్ఞప్తిపై కోర్టు స్పందించింది. ఇప్పటికే శాసనమైన ఈ బిల్లు అమలుపై ఈ పరిస్థితుల్లో స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఆ చట్టంలోని లోపాలను తొలగించకుండా ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన మాట తమకు తెలుసునని అయితే ఈ పరిస్థితుల్లో దానిపై స్టే విధించలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.