జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో కుప్పకూలిన మరో వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలిగురి (పశ్చిమ బెంగాల్) సెప్టెంబర్ 7: పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర ప్రాంతంలోని సిలిగురి సమీపంలో మరో పురాతన వంతెన శుక్రవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ ట్రక్ డ్రైవర్ గాయపడ్డారు. మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో ఇలా పాత వంతెనలు కూలిపోవడం ఇది రెండోసారి. దక్షిణ కోల్‌కతాలో సెప్టెంబర్ 4న మజర్హత్ వంతెన కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, 24మంది గాయపడిన సంగతి తెలిసిందే. కాగా సిలిగురి సమీపంలోని వంతెన మధ్యభాగం శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఆసమయంలో వంతెన దాటుతున్న ఓ ట్రక్‌పై వంతెన శకలాలు పడడంతోడ్రైవర్ గాయపడ్డాడు, మాన్‌గంజ్-్ఫన్‌సిదేవాప్రాంతాలను 22 కిలోమీటర్ల దూరంలోని సిలిగురితో కలిపే ఈ పాత వంతెనపై లోడ్డుతో వెళ్లే ట్రక్కులను ఇప్పటికే నిషేధించారు. అయినా ఇలాంటి వాహనాలెన్నో ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తూనే ఉన్నాయని ఈ వంతెన కూలడానికి ఇదే కారణమని ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ మంత్రి రబీంద్ర ఘోష్ తెలిపారు. ఈ వంతెన చాలాకాలం క్రితం నిర్మితమైందని, ఎప్పుడు నిర్మించిందీ తెలిపే ఆధారాలు లభించలేదని ఆయన చెప్పారు. కాగా పాన్‌సిదేవాలోలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి సైతం గత ఆగస్టు 11న కూలిపోయింది. అదృష్ట వశాత్తు అక్కడ ఎవరూ గాయపడలేదని డార్జిలింగ్ జిల్లాకు చెందిన సీనియర్ సీపీఎం నాయకురాలు జిబేష్ శంకర్ తెలిపారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే ఇలా జరుగుతోందని ఆమె ఆరోపించారు.

ఇద్దరు కాశ్మీరీ తీవ్రవాదుల అరెస్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: జమ్మూకాశ్మీర్‌లోని ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన తీవ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను రెడ్‌ఫోర్ట్ వద్ద ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు శుక్రవారం అందజేసిన వివరాల మేరకు కాశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతానికి చెందిన ఈ నిందితులను పర్వేజ్ (24), జమ్‌షెడ్ (19)గా గుర్తించారు. రెడ్‌పోర్ట్ వద్దగల జామామసీద్ బస్‌స్టాప్ వద్ద జమ్మూకాశీర్ తిరిగి వెళ్లేందుకు గురువారం ఉదయం బస్‌కోసం వేచివున్న ఈ నిందితులను అరెస్టు చేశామని స్పెషల్ సెల్ పోలీసు డిప్యూటీ కమిషనర్ పీఎస్ కుష్వాహ తెలిపారు. ఈ నిందితులు ఢిల్లీని వారి కార్యకలాపాలకు ట్రాన్సిట్ పాయింట్‌గా వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. పర్వేజ్ సోదరుడు ఓ కరుడుగట్టిన తీవ్రవాది. అతను షోపియన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గత జనవరి 26న మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్ గజ్రోలాలో ఎంటెక్ చేస్తున్న పర్వేజ్ అతని సోదరుడి భావాలపట్ల ఆకర్షిడై తీవ్రవాదిగా మారినట్లు తెలుస్తోంది. అలాగే డిప్లొమా చివరి సంవత్సం చదువుతున్న జమ్‌షెడ్ సైతం మహమ్మద్ అబ్దుల్లాబాసిత్ ఉద్యమంలో ప్రత్యేకంగా సత్కరించబడ్డాడు. ఇతన్ని గతంలో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. నిందితులు రెండోసారి ఢిల్లీకి వచ్చారని, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహ నుంచి కాశ్మీర్‌కు ఢిల్లీ మీదుగా గత మేనెలలో వీరిద్దరూ ప్రయాణించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపారు. కాగా నిందితుల నుంచి రెండు పిస్టిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఓమర్ ఎల్‌బీఎన్ నాజిర్, అదిల్ తోకర్ ఆదేశాల మేరకు ఈ నిందితులు పనిచేసున్నట్లు తెలిపారు.