రాష్ట్రీయం

మొదటి ప్రాధాన్యతపై తెలంగాణ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదటి ప్రాధాన్యత విధానంపై జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో జ్యోతిషం పని చేయదని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు 2002లో రాష్టప్రతి సూచనపై ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణ శాసన సభకు మొదటి ప్రాధాన్యతపై ఎన్నికలు జరిపించవలసి ఉంటుందని రావత్ వివరించారు. శుక్రవారం తనను కలిసిన కొందరు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ శాసన సభ ఎన్నికలను మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసన సభల ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు రావత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ శాసన సభ అకస్మాత్తుగా రద్దైందని గుర్తుచేశారు. అందుకే, తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుండి నివేదిక కోరామని రావత్ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలు పరిశీలించిన తర్వాతే తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోగలుగుతామని పేర్కొన్నారు. చట్ట ప్రకారం రద్దైన శాసన సభకు ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని, అయితే రాష్టప్రతి పంపే ఒకటో నంబర్ రిఫరెన్స్‌పై సుప్రీం కోర్టు 2002లో ఇచ్చిన తీర్పు ప్రకారం రద్దైన శాసన సభకు మొదటి ప్రాధాన్యతపై ఎన్నికలు నిర్వహిస్తామని రావత్ వివరించారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆరు నెలల పాటు అధికారంలో కొనసాగేందుకు అవకాశం ఇవ్వటం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అపద్ధర్మ ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్న అధికారం ద్వారా అనవసర ప్రయోజనం పొందకుండా చూసేందుకు రద్దైన శాసన సభకు మొదటి ప్రాధాన్యతపై ఎన్నిక నిర్వహించాలన్నది సుప్రీం కోర్టు అభిప్రాయమని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ఇలాంటి అన్ని అంశాలతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటుందని రావత్ చెప్పారు. ప్రస్తుతానికి దేని గురించి కూడా స్పష్టత లేదని అన్నారు. జరగబోయే షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనే ప్రశ్నపై స్పందిస్తూ, ఎన్నికలపై జ్యోతిషం పనిచేయదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విలేఖరుల సమావేశంలో చేసిన ప్రకటనను రావత్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై ఎవరైనా, ఏమైనా చెప్పి ఉంటే అది పూర్తిగా నిరాధారమైందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చట్టంలోని నియమనిబంధనలను పాటించటం ద్వారా ఎన్నికలను సమర్థంగా స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుతుందని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వీవీ ప్యాట్‌లు సక్రమంగా పని చేయకపోవటంపై విచారణ జరిపించామని, నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు తప్పులను దిద్దుకునే చర్యలు తీసుకున్నామని తెలిపారు. శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది తప్ప జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాదన్నారు.
లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే అవకాశాలు లేవని రావత్ స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ కాలం 2019 జనవరి చివర వరకూ ఉంటుందన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తాము సామాజిక మాధ్యమాల వారితో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం ఉండకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రావత్ చెప్పారు.