జాతీయ వార్తలు

రాహుల్‌తో పోటీపడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రాహుల్ గాంధీతో ఎవరైనా పోటీపడతారా? అంటూ విమర్శకులను కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ప్రస్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 31న యాత్రకు బయలుదేరిన ఆయన ఆతర్వాత కైలాస పర్వతం వద్ద నిలబడి తీయించుకున్న ఫొటోలను తన ట్విట్టర్‌లో ఉంచారు. అంతకు ముందు, భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఈ యాత్ర కోసం చైనాను సంప్రదించారంటూ బీజేపీ ఆరోపించింది. రాహుల్ ఒక భారతీయుడిగా కాకుండా, చైనా రాయబారిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య రాహుల్ కైలాస యాత్రపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలావుంటే, ఈ యాత్రలో భాగంగా రాహుల్ ఇప్పటి వరకూ 46,433 మెట్లు ఎక్కారని, 34కుపైగా కిలోమీటర్లు నడిచారని కాంగ్రెస్ తన అధికార వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ వివరాలు ఫిట్నెస్ మొబైల్ యాప్ ‘్ఫట్‌బిట్’లో నమోదయ్యాయని వివరించింది. రాహుల్ 203 అంతస్థులు ఎక్కారని, 34.31 కిలోమీటర్ల దూరం ప్రయాణించారని తెలిపింది. దీని ద్వారా 4,466 క్యాలరీలు ఖర్చయినట్టు పేర్కొంది. ‘మీలో ఎవరైనా ఈ స్థాయిలో యాత్ర కొనసాగిస్తారా?’ అని విమర్శకులను నిలదీసింది. ఇలావుంటే, తాజాగా మానస సరోవరంతోపాటు కైలాస పర్వతం ఫొటోలను కూడా రాహుల్ ట్విట్టర్‌లో ఉంచారు. సరోవరం నీరు ఎంతో నిశ్చలంగా, స్వచ్ఛంగా ఉన్నాయని, ఇక్కడ ఉన్నంత ప్రశాంతత మరెక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. ఇంతటి స్వచ్ఛతతో కూడుకున్నవి కాబట్టే భారత దేశంలో ఈ నీటిని ఆరాధిస్తారని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు రాహుల్ ఎక్కిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఒకవైపు పూర్తిగా ఒరిగిపోయిన విమానాన్ని పైలట్లు అతి కష్టం మీద ల్యాండింగ్ చేయగలిగారు. ఆ సమయంలోనే తాను తీర్థయాత్ర చేస్తానని రాహుల్ పేర్కొన్నారు. తర్వాత కొన్నాళ్లకు తాను శివ భక్తుడిని కాబట్టి, కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లనున్నట్టు చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం భారత అధికారులను సంప్రదించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. చైనా ప్రతినిధిగా మారిపోయారంటూ రాహుల్‌పై బీజేపీ ధ్వజమెత్తింది. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగడంతో, మాటల యుద్ధం కొనసాగుతున్నది.