జాతీయ వార్తలు

కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషనరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ఎన్నికల కమిషనరా అని సీపీఐ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీకి ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి సీపీఐ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్‌ను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కలిశారు. అనంతరం సురవర సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ శాసన సభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేసే హక్కు కేవలం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉందని, కాని ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరులో తెలంగాణ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని, అక్టోబరులో ఎన్నికలు జరగుతాయాని,నవంబరులో ఫలితాలు వస్తాయాని అని ఎలా వెల్లడిస్తారని నిలదీశారు. దీనిపై అభ్యతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. శాసన సభను రద్దు చేసుకోనే హక్కు తెలంగాణ శాసన సభకు, మంత్రివర్గానికి ఉన్నాదని, కానీ, ఎన్నికల సంఘానికి ఉన్న హక్కులను, బాధ్యతలను ఆ రాష్ట్ర ఆపద్ధర్మ కేసీఆర్ ఎలా హరిస్తారని నిలదీశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఏ హక్కుతో ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్ల కాలం పూర్తి కాకుండా తొమ్మిది నెలల ముందుగానే అసెంబ్లీను రద్దు చేయడాన్ని పిరిగిపంద చర్యగా ఆయన ఆభివర్ణించారు. తెలంగాణ ప్రతి పక్ష పార్టీలను అగౌరవ పరిచేలా వ్యాఖ్యాలు చేసిన కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులను సన్నాసులు, దద్దమ్మలు అంటూ నీచంగా మాట్లాడే కుసంస్కారి కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్ లక్ష్మణరేఖ దాటారని, ఆయన వ్యవహార శైలిపై ఏన్నికల కమిషన్ ప్రధానాధికారి కూడా విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
వివరణ ఇవ్వండి: మర్రి
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు నవంబర్‌లోనే ఎన్నికల జరగుతాయని, దీనిపై తాను ఎన్నికల కమిషన్‌తో ఇంతకు ముందే చర్చలు జరిపానని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సినియర్ నాయకుడు మర్రి శిశిధర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ మిడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శుక్రవారం శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రధాన అధికారులు, ఈసీ సభ్యుల పనితిరుపై సందేహాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాను చర్చలు జరిపినట్టు, ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అంగీకరించినట్టు కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించిన విషయాన్ని లేఖలో శశిధర్‌రెడ్టి వివరించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికల నిర్వహించేలా తాను ఎన్నికల సంఘాన్ని ఒప్పించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించడాన్ని తప్పుపట్టారు. దీనితో ఎన్నికల సంఘం తీరుపైనే ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయాని అన్నారు. వచ్చే ఎడాది 2019 జనవరిలో తుది ఓటర్ల జాబితా విడుదలైయ్యా క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఎన్నికలు నిర్వసిస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగా సంస్థగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ప్రజలకు వ్యక్తమవుతున్న సందేహాలను తెరదించాలని ఈసీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించని పక్షంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.